Tuesday, October 28, 2025 04:49 AM
Tuesday, October 28, 2025 04:49 AM
roots

పెద్దిరెడ్డి టార్గెట్ గా పవన్ సంచలన అడుగులు

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. భూములను ఆక్రమించడంలో కీలకంగా వ్యవహారించారు అనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా చిత్తూరు జిల్లాతో పాటుగా ఒకటి రెండు రాయలసీమ జిల్లాల్లో జరిగిన భూ కబ్జా వ్యవహారాల్లో ఆయన కీలకంగా ఉన్నారు. ప్రభుత్వ, అటవీ భూములను పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ ఎక్కువగా ఫోకస్ చేసింది. అటవీ భూములను ఆక్రమించి వాటిని తమ ఆస్తులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వ భూముల్లో కూడా లే అవుట్ లో వేసారనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read : ఏపీకి బాహుబలి ప్రాజెక్ట్

కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో.. మదనపల్లిలో జరిగిన ఫైల్స్ దహనం కేసులో పెద్దిరెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయనను కాపాడటానికే కొందరు వ్యక్తులు ఆ ఘటనకు పాల్పడ్డారు అనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన పత్రాలు అందులో ఉండటంతోనే పెద్దిరెడ్డి.. ఆ పని చేయించారని భావిస్తున్నారు. ఇదిలా ఉంచితే అటవీ భూముల ఆక్రమణల విషయంలో దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా కొందరు అధికారులు మాత్రం ఆయనను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వడం సంచలనం అయింది.

Also Read : టిష్యూ పేపర్ విష ప్రచారం..!

ఈ తరుణంలో పెద్దిరెడ్డిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్న అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని వారిపై చర్యలకు సిద్దమయ్యారు. పెద్దిరెడ్డి కుటుంబీకులపై కూడా క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ డీజీ నివేదికతో చర్యలకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ, ప్రభుత్వ బుగ్గమఠం భూముల ఆక్రమణలపై విజిలెన్స్ డీజీ నివేదిక ఇచ్చారు. భూములను సంరక్షించలేకపోయిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్దం అయింది. అలాగే ఫైల్స్ దహనం కేసులో కూడా కీలకంగా వ్యవహరించిన అధికారులపై గురిపెట్టి చర్యలకు సిద్దమైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్