జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలన మీద దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది చివరి వరకు పవన్ పాలన మీద దృష్టి పెట్టి అన్ని విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పరిపాలనలో ఉండే లోటుపాట్లను తెలుసుకోవాలని, తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చేయాలని భావిస్తున్నట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి. పరిపాలన పై అవగాహన తెచ్చుకుని, కీలక సమస్యల పరిష్కారం చేసిన తరువాత మాత్రమే సినిమాలను మొదలుపెట్టాలని భావిస్తున్నారట.
ఇప్పుడే సినిమాలు మొదలుపెడితే వాటి మూలంగా పాలనపై దృష్టి పెట్టలేనని, అనవసరంగా విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఒకరిద్దరు దర్శకులు కథలు వినిపించేందుకు వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇక తనకు ఇచ్చిన అడ్వాన్స్ లు కూడా ఆయన తిరిగి ఇవ్వాలని భావిస్తున్నట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే అమరావతిలో ఇల్లు కట్టుకోవాలని పవన్ భావిస్తున్నట్టుగా సమాచారం. తుళ్ళూరు ప్రాంతంలో ఆయన ఇంటి కోసం స్థలం చూస్తున్నారట.
Also Read : కలెక్టర్లకు వంద రోజుల ప్రణాళిక.. బాబు దిశానిర్దేశం
ఆ స్థలం కోసం పవన్ తన బంధువుల్లో ఒకరికి బాధ్యత అప్పగించారని, త్వరలోనే స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నారని టాక్. అధికారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలంటే ఇల్లు అమరావతిలో ఉంటే మంచిదనే భావనలో పవన్ ఉన్నారట. అలాగే తన ఇంటి వద్ద ప్రజా సమస్యలు వినే విధంగా ఒక వేదిక ను కూడా నిర్మించే ఆలోచనలో ఆయన ఉన్నారట. దీనిపై ఒక సంస్థకు బాధ్యతలు కూడా అప్పగించారని టాక్. మరి ఏం జరుగుతుంది, ఇల్లు ఎప్పుడు నిర్మాణం మొదలుపెడతారు అనేది చూడాలి.




