Sunday, October 19, 2025 05:51 AM
Sunday, October 19, 2025 05:51 AM
roots

పేరు పాలిటిక్స్.. రూల్స్ మర్చిపోతే ఎలా..?

ఎవరు ఏ పని చేసినా సరే.. పేరు కోసమే కదా. ఇక రాజకీయ పార్టీల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. హైదరాబాద్ అభివృద్ధి తన వల్లే అనేది చంద్రబాబు ఇప్పటికీ చెబుతున్న మాట. హైటెక్ సిటీ నిర్మాణం వల్లే సైబరాబాద్ నిర్మాణానికి బీజం పడిందని చంద్రబాబు చెబుతున్నారు. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ వైఎస్ఆర్ బ్రాండ్ అంటుంటే.. అమ్మఒడి పైన తమకే పేటెంట్ ఉందనేది వైసీపీ నేతల మాట. ఇక కూటమి గెలుపులో తమదే కీలక పాత్ర అంటారు జనసేన పార్టీ నేతలు. ఇలా ఎవరికి వారు పేరు కోసం తాపత్రయ పడుతూనే ఉంటారు.

Also Read : బాబు పై నా అభిప్రాయం ఏంటంటే..!

ఏపీలో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణంలో కీలకమైన సీఆర్‌డీఏ ప్రాంతీయ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జీ+7 నిర్మించిన ఈ భవనాన్ని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంగా కూడా వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో తొలి శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకను ప్రస్తుతం చాలా సింపుల్‌గా నిర్వహించిందనే చెప్పాలి. అయితే.. కార్యాలయం ప్రారంభం పైనే ఇప్పుడు టీడీపీ – జనసేన పార్టీల అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Also Read : జోగి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

సీఆర్‌డీఏ ప్రాంతీయ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై పవన్ కల్యాణ్ పేరు లేదనేది జనసేన అభిమానుల ప్రశ్న. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నారు. ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే మాట టీడీపీ నేతలకు సరిగ్గా సరిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారా అని వాదిస్తున్నారు. పవన్‌ను మర్చిపోతే.. ప్రతిపక్ష హోదా కూడా రాదనే విషయం గుర్తు పెట్టుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు లేకుండా అమరావతిలో తొలి భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు తమన్ అదిరిపోయే గిఫ్ట్.. బాక్సులు బద్దలే..!

జనసేన అభిమానుల ప్రశ్నలకు టీడీపీ అభిమానులు కొందరు ధీటుగానే జవాబిస్తున్నారు. అది పార్టీ కార్యక్రమం కాదనే విషయం మర్చిపోతే ఎలా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ అనేది ఉంటుందనే విషయం కూడా తెలియదా అని విమర్శలు చేస్తున్నారు. ప్రారంభోత్సవం చేసిన సీఎం చంద్రబాబు, సంబంధిత శాఖ మంత్రి నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాకు చెందిన మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు వేశారు తప్ప.. అందరి పేర్లు అక్కడ వేయరనే విషయం కూడా తెలియదా అని సెటైర్లు వేస్తున్నారు.

మరో అడుగు ముందుకు వేసిన టీడీపీ అభిమానులు.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పవన్ రాజమండ్రి పర్యటన ఫోటోలను బయటపెడుతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటన సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. అప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలకాల మీద చంద్రబాబు పేరు ఎక్కడా లేదు. అంటే సీఎం పేరు రాస్తే పేరు వస్తుందని భయమా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రోటోకాల్ ఉంటుందని.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ సోషల్ మీడియాలో డైలాగ్ వార్‌కు ఆజ్యం పోస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్