Saturday, October 18, 2025 09:20 PM
Saturday, October 18, 2025 09:20 PM
roots

యువతకు ఏం కావాలో తేల్చేసిన పవన్..!

పవన్ కల్యాణ్.. సినిమా హీరోగానే కాకుండా.. ఓ రాజకీయ పార్టీ అధినేతగా కూడా ప్రసుత్తం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎన్టీయేలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోదీ అయితే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీయే బలోపేతానికి పవన్ సాయం తీసుకుంటున్నారనే మాట బాగా వినిపిస్తోంది. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారని ఇప్పటికే కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు పవన్ కూడా తరచూ తమిళనాడులోని పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు.

Also Read : చంద్రబాబును తిట్టినా చలనం లేదా..? ఎందుకీ మౌనం..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి పవన్ ఎంతో కృషి చేశారు. ఇంకా చెప్పాలంటే.. టీడీపీ – జనసేన – బీజేపీ మధ్య పొత్తు కుదరటం మొదలు.. సీట్ల కేటాయింపు, ఎన్నికల్లో విజయం వరకు పవన్ చాలా కీలకంగా వ్యవహరించారు. జగన్ సర్కార్ తప్పులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబు వంటి సీనియర్ నేత గెలుపు ప్రస్తుతం రాష్ట్రానికి ఎంతో అవసరమని వివరించారు.

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పనులు చేస్తూ దూసుకెళ్తున్నారు పవన్. ముుక్కుసూటిగా వ్యవహరించే పవన్ విధాపరమైన నిర్ణయాల విషయంలో కూడా తన అభిప్రాయాలను ఇటీవల నిర్మోహమాటంగా వివరిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో లూ లూ మాల్‌కు భూ కేటాయింపులపై పవన్ అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. లూ లూ వంటి సంస్థలకు భూములు కేటాయించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా పవన్ సూచించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. కొన్ని అంశాల్లో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన కామెంట్‌ కూడా ఇది నిజమేనా అనే చర్చకు అవకాశం కల్పిస్తోంది.

Also Read : అల్లు అర్జున్ విత్ వైఫ్ స్నేహ రెడ్డి

తొలి నుంచి అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడుతున్న పవన్.. సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు అందివ్వడంపై కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవన్ పెద్దగా ప్రచారం చేయలేదనే చెప్పాలి. ఉపాధి వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనే మాట పవన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కూడా. అదే మాటను మరోసారి పవన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఏడేళ్ల క్రితం తిత్లీ తుఫాన్ బాధితులను పవన్ స్వయంగా పరామర్శించారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు యువకులతో పవన్ ముచ్చటిస్తున్న ఫోటోను మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్రం కోసం పవన్ కల్యాణ్‌తో మొదలైన తన ప్రయాణం గురించి ప్రస్తావించారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు తనను పవన్ ఎలా మోటివేట్ చేశారనే విషయాన్ని కూడా మనోహర్ గుర్తు చేశారు. నాటి నుంచి తన అడుగులు పవన తోనే అంటూ పవన్‌తో ఉన్న ఫోటోను మనోహర్ పోస్ట్ చేశారు.

మనోహర్ ఎక్స్‌‌లో చేసిన పోస్టును ట్యాగ్ చేసిన పవన్.. తనదైన శైలిలో స్పందించారు. 2018, అక్టోబర్ 12న తిత్లీ బాధితులతో జరిగిన సంభాషణ ఇప్పటికీ తనకు గుర్తుందన్నారు. వాళు ఎలాంటి ఉచితాలు అడగటం లేదు.. ఎలాంటి సంక్షేమ పథకాలను అడగటం లేదు.. కానీ వాళ్లు “మాకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి.. ఉచితాలు వద్దు.” అని చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. యువత నిజమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి. యువత కలలను నెరవేర్చుకోవడానికి.. వారిని అర్థం చేసుకోవడానికి నేను తరచూ కలుస్తూనే ఉంటాను అంటూ పవన్ కామెంట్ చేశారు.

Also Read : తెలంగాణలో ఆగని మంత్రుల వార్

పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. దేశంలో ఎక్కడ చూసినా సంక్షేమాల జాతర జరుగుతోంది. ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు నానా పాట్లు పడుతున్నాయి. వాటి అమలు కోసం పెద్ద ఎత్తున అప్పులు కూడా చేస్తున్న పరిస్థితి. ఇది అత్యంత ప్రమాదమైన అంశమని ఇప్పటికే ఆర్థిక నిపుణులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఏపీలో కూడా గతంలో జగన్ సర్కార్ పథకాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పథకాల పేరుతో తాయిలాలు అందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామనేది చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట. ఇలాంటి సమయంలో పవన్ పోస్ట్ ఆసక్తిగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్