రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఏం మాట్లాడతారో.. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో.. వాటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ముఖ్యంగా రెండు పార్టీలు ఒక కూటమిలో ఉన్నప్పుడు పరిణామాలు కాస్త ఇంట్రస్ట్ పెంచుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలో కొన్ని సీన్స్ కాస్త హీట్ పెంచాయి. ఎవరూ ఊహించని విధంగా సినిమా తేడాగా ప్లే అయింది. అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ వ్యవహారం.. కూటమికి చికాకుగా మారింది.
Also Read : బాబోయ్.. 130 కోట్ల అప్పులు..!
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్.. సినిమా పెద్దలను అవమానించారని కామినేని చేసిన కామెంట్స్, ఆ తర్వాత బాలకృష్ణ రియాక్షన్ అన్నీ.. హీట్ ను ఓ రేంజ్ లో పెంచాయి. కామినేని కామెంట్స్ పక్కన పెడితే, బాలయ్య చేసిన కామెంట్స్ దెబ్బకు మెగా ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. అది కాస్త జనసేన వర్సెస్ టీడీపీగా వాతావరణం మారిపోయింది. దీనిపై అధినేతలు స్పందించలేదు గానీ.. సోషల్ మీడియా మాత్రం భగ్గుమంది. సమర్ధింపులు, పొగడ్తలు, తిట్లతో యవ్వారం యమా వేడిగా కనపడింది.
ఇది కూటమిలో చీలిక తేవడం ఖాయం అని.. అనలిస్ట్ లు అనాలిస్ లు చెప్పారు. కానీ.. కానీ.. కానీ.. ఒక్క సీన్.. ఈ సినిమా మొత్తాన్ని అట్టర్ ఫ్లాప్ చేసింది. ఊహించని పరిణామానికి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సిఎం చంద్రబాబు నాయుడు. ఘటన జరిగిన మరుసటి రోజు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జ్వరం తీవ్రమైనది అని, ఆయనను హైదరాబాద్ తరలించారు అని వార్త వచ్చింది. ఆ తర్వాత సిఎం చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్ళారు. పవన్ ను పరామర్శిస్తారు అనే వార్త ఇంకొకటి బయటకు వచ్చింది.
Also Read : గుడివాడకి బైబై చెప్పిన కొడాలి..!
ఆ తర్వాత పవన్ ను చంద్రబాబు కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి. అంతే, పెట్రోల్ పోయాలనుకున్న ఉత్సాహవంతుల ఆశలపై ఆ ఫోటోలు నీళ్ళు జల్లాయి. అప్పటి వరకు కస్సుబుస్సు మన్న మెగా ఫ్యాన్స్ కూల్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఎవడేం చేయాలనుకున్నా.. మమ్మల్ని ఏం చేయలేరు అనేసారు ఇద్దరూ. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ లో ఓ సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారనే వార్తలు కూడా వచ్చాయి. ఎవరు ఎలా ట్రై చేసినా.. పవన్ జ్వరం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మార్చేసింది.