పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఎంతటి అనర్ధానికి దారితీసిందో అందరికీ తెలిసిందే. ఇక ఇదే విషయం పై నిర్మాత దిల్ రాజుతో ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. త్వరలో విడుదలకి సిద్దంగా ఉన్న “Game Changer” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ ని ఆహ్వానించటానికి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని కలిసారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాబట్టే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగలిగారని మరొకరితో అయితే సాధ్యం కాదన్నారు. అల్లు అర్జున్ అంశంలో జరిగింది గోటితో పోయేదానిని గొడ్డలి వరకూ తెచ్చుకోవడమేనన్నారు పవన్. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాద పూర్వకంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఒక్కడ్ని కూడా వదలను.. పవన్ వార్నింగ్
ప్రతీ హీరో తను చేసిన సినిమాకు పొగడ్తలు కోరుకుంటాడని, హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడని కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ అంశంలో మరింతగా ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినిమా హాలు వాళ్ళు కానీ అధికారులకి ముందుగా చెప్పి ఉండాలని పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమే అని స్పష్టం చేసారు. నేను అందుకే సినిమా హాల్స్ కి వెళ్ళను అన్నారు పవన్ కళ్యాణ్. సినిమా బాగునప్పుడు ప్రజల మన్ననలు చూడటానికి వెళ్తామని, ప్రజల రెస్పాన్స్ కి వెలకట్టలేని అంశం అని తెలిపారు.
Also Read : కేంద్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు తెలుగు నేతలు
సినిమా హాల్ కి వెళ్లి చూడటం అనేది అందరూ చెయ్యడం లేదన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హీరోలు సినిమా హాల్స్ కు వెళ్లి చూసే పరిస్థితి లేదన్నారు. అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టడమేనని… అల్లు అర్జున్ సిబ్బంది అల్లు అర్జున్ కి చెప్పాల్సిందన్నారు. చట్టం అనేది అందరికీ సమానమే అని తెలిపారు. బాధితుల కుటుంబంకి హీరోకి తెలియకుండానే… సినిమా యూనిట్ వెళ్లి భరోసా ఇస్తే బాగుండేదన్న ఆయన… కనీసం బాధిత కుటుంబం ఇంటికి మూడో రోజు అయినా హీరోగా అల్లు అర్జున్ వెళితే బాగుండేదన్నారు. సినిమా అనేది యూనిట్ గా తీసినప్పుడు ఏదైనా రాంగ్ జరిగినప్పుడు అందరు బాధ్యత వహించాలన్నారు.




