హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస సినిమాలతో కాస్త బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం, మరో వైపు పార్టీ, ఆ తర్వాత సినిమాలతో పవన్ బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా పవన్ కు షాక్ ఇచ్చినా.. ఇప్పుడు ఓ జీ సినిమాతో బాక్సాఫీస్ పై యుద్దానికి మళ్ళీ రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది.
Also Read : నన్ను వదిలేయండి..జగన్ కు వల్లభనేని షాక్
ప్రమోషన్ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ పాల్గొనడంపై విమర్శలు రావడంతో.. ఈ సినిమా ప్రమోషన్స్ కు ఆయన దూరంగా ఉండే అవకాశం ఉందనే వార్తలు సైతం వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపుగా సినిమాలకు గుడ్ బై చెప్పేసే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది. రాజకీయాలపై ఫోకస్ చేయాలనే కారణంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : కాంతారాకు షాక్.. హైకోర్ట్ నిర్ణయం ఏంటో..?
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే సగం కంప్లీట్ చేసినట్టు కూడా వార్తలు వింటున్నాం. ఆ తర్వాత ఒకటి రెండు కథలు పవన్ వద్దకు వచ్చినా.. ఇప్పట్లో వద్దని చెప్పినట్టుగా టాక్. తాను రాబోయే మూడేళ్ళు రాజకీయాల్లోనే బిజీగా ఉంటానని, పాలనకు, పార్టీకి ఎక్కువగా సమయం ఇవ్వాలి అనుకుంటున్నా అంటూ పవన్ తన వద్దకు వచ్చిన దర్శకుల వద్ద చెప్పినట్టుగా సమాచారం. మళ్లీ 2029లో ఎన్నికల తర్వాతే ఆయన సినిమాల గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.