ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న మంత్రి పదవి విషయంలో ఎప్పటినుంచో ఊహాగానాలు వింటూనే ఉన్నాం. రాజకీయ పరిస్థితులు, పరిపాలన కారణాలతో ఆ మంత్రి పదవిని భర్తీ చేసే విషయంలో ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దాదాపు ఏడాది నుంచి దీని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబు క్యాబినెట్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని భావించారు. కానీ పిఠాపురంలో జరిగిన సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయనకు మంత్రి పదవి దూరమైంది.
Also Read : కవితకు బండి సంజయ్ గాలం..?
అటు బిజెపి కూడా ఈ మంత్రి పదవి విషయంలో ఆసక్తి చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో జనసేన పార్టీ పక్కకు తప్పుకున్నట్లు సమాచారం. మంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే పవన్ కళ్యాణ్ భారం వేసినట్లు తెలుస్తోంది. మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారట. బిజెపికి ఇచ్చిన తనకు ఎటువంటి ఇబ్బంది లేదని లేదు మీరు తీసుకుంటాను అన్న తీసుకోవచ్చంటూ చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
Also Read : రష్యాతో ఉంటారా.. సిగ్గుచేటు.. అమెరికా సంచలన కామెంట్స్
నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు టిడిపి క్యాడర్ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ కు అర్థమయ్యేలా గత అసెంబ్లీ సమావేశాలు సమయంలో వివరించారు. ఇక ఇప్పుడు మంత్రి పదవి విషయంలో చంద్రబాబుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. బిజెపి నుంచి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినపడుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది సీనియర్ నేతలు ఈ మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జనసేన రేసు నుంచి తప్పుకోవడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండవచ్చు అంటూ రాజకీయ వర్గాలు ఉంటాయి. దాదాపుగా కడప జిల్లాకు చెందిన నేతకే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అంటూ టిడిపి వర్గాల్లో చర్చి కూడా జరుగుతోంది.