జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ భాష విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో రేగిన వివాదం పై పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత కొన్నాళ్లుగా తమిళనాడులో హిందీ భాష పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రూపీ సింబల్ ని కూడా తమిళనాడులో వాడేందుకు అక్కడ ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. అక్కడి ముఖ్యమంత్రితో పాటుగా ఇతర నేతలు కూడా హిందీ భాష విషయంలో ఘాటుగా నే రియాక్ట్ అవుతున్నారు.
Also Read : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. వాళ్ళతో లింకులు ఉంటే అంతే..!
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రితో పాటుగా జాతియ స్థాయి నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. హిందీ విషయంలో పవన్ కళ్యాణ్ కు కనీస జ్ఞానం లేదని.. బిజెపితో పొత్తులో ఉన్నంతమాత్రాన దక్షిణాది రాష్ట్రాల మనోభావాలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని దక్షిణాది రాష్ట్రాల నేతలు మండిపడుతున్నారు. ఇక హిందీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఉత్తరాది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బిజెపి నేతలతో పాటుగా ఎన్డీఏ పక్షాలు సమర్ధిస్తున్నాయి.
Also Read : ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నా..వైఎస్ సునీత సంచలన కామెంట్స్
అయితే ఈ వ్యాఖ్యలు చూసిన రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారని, బిజెపి కూడా పవన్ కళ్యాణ్ ను జాతీయస్థాయిలో ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. హిందూ ధర్మం పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ భాషతో ఉత్తరాది రాష్ట్రాలను ఫోకస్ చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తనను తాను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా కష్టపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బిజెపికి నాయకత్వ లోపం ఉంది. ఆ లోపాన్ని పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే పవన్ ఎక్కువగా జాతీయ అంశాలను టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.




