ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. భారత్ ను తక్కువ అంచనా వేసిన ఇంగ్లీష్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో భారత జట్టు చుక్కలు చూపించింది. అదిరిపోయే బౌలింగ్ అటాక్ తో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. బలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ఇద్దరూ ఓ ఆట ఆడుకున్నారు. పేస్ బౌలర్లు ఇద్దరూ ఏకంగా 17 వికెట్లు తీసుకున్నారు. మొత్తం 20 వికెట్లలో 18 పేస్ బౌలర్లకు పడగా రెండు స్పిన్నర్లకు పడ్డాయి.
Also Read : కరేడు రైతుల పోరాటంలో వైసీపీ ఎటువైపు..!
ఆకాష్ దీప్ 10, సిరాజ్ 7, ప్రసిద్ 1 తీసారు. మరి లార్డ్స్ లో జరగబోయే మూడో టెస్ట్ లో జట్టు కూర్పు ఎలా ఉంటుంది..? మరో మూడు రోజుల్లో మొదలుకానున్న ఈ టెస్ట్ దాదాపుగా భారత్ ముగ్గురు బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉండవచ్చు. బూమ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా.. ఆకాష్ దీప్ సిరాజ్ ఇద్దరూ బూమ్రాతో కలిసి ఆడే అవకాశం ఉంది. ఒకవేళ నలుగురు బౌలర్లు కావాలి అనుకుంటే.. నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి.. అర్షదీప్ సింగ్ ను తీసుకునే అవకాశం ఉండవచ్చు.
Also Read : కష్టాల క్రికెట్.. ఆకాష్ దీప్ జీవితంలో వరుస విషాదాలు
ఇప్పటి వరకు అర్షదీప్ సింగ్ కు అవకాశం రాలేదు. మూడో టెస్ట్ లో అయినా వస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇక బ్యాటింగ్ లో కరుణ్ నాయర్ కొనసాగే అవకాశం ఉండవచ్చు. కోచ్ గంభీర్ మద్దతు ఉండటంతో కరుణ్ నాయర్ ను కొనసాగించవచ్చు. సాయి సుదర్శన్ స్థానంపైనే క్లారిటీ రావడం లేదు. అటు అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగానే కనపడుతున్నాయి. కరుణ్ నాయర్ ను తప్పిస్తే అతనికి అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి.