ఆంధ్రప్రదేశ్ లో మరి అవినీతి పుట్ట బయటపడింది. కొవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లతో అక్రమాలకు పాల్పడ్డారు అని అంతర్గత విచారణలో వెల్లడి అయింది. గనుల వెంకటరెడ్డి తన బినామీకి చెందిన ధన్వంతరికి టెండరు దక్కేలా చేసి ప్లాంట్లు ఏర్పాటు కాకుండానే సగం సొమ్ము చెల్లించారు అని గుర్తించింది ప్రభుత్వం. ఈ మేరకు ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేసారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో.. గనుల వెంకటరెడ్డి తన బినామీ సంస్థ ద్వారా చేతి వాటం ప్రదర్శించారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Also Read :అడ్డంగా బుక్ అయిన కేటిఆర్
కొవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సంస్థలు ముందుకురావాలని అప్పట్లో ప్రభుత్వం కోరగా… కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో రెండేసి చొప్పున ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ ఖనిజాభి వృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) సిద్ధమైంది. కడప జిల్లాలో కలెక్టర్ నుంచి అభ్యర్ధన లేకుండానే ఏపీఎండీసీయే రెండు ఆక్సిజన్ ప్లాంట్ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టారు. వాస్తవానికి రైల్వేకోడూరు సీహెచ్సీ 15 పడకలతో, రాజంపేట ఆసుపత్రి 50 పడకలతో ఉండగా ఏపీఎం డీసీ మాత్రం 100 పడకల ఆసుపత్రులకు అవసరమయ్యే 500 ఎల్పీహెచ్ సామర్థ్యముండే ఆక్సిజన్ కొనుగోలు చేసింది.
రైల్వేకోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో, రాజంపేట ఆసుపత్రిలో ఒక్కో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ఎండీసీ టెండర్లు ఆహ్వానించగా… మైనింగ్ సంస్థ అయిన ఏపీఎండీసీకి వైద్యపరమైన అనుభవం లేకపోయినా… అడుగు పెట్టింది. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపా యాల అభివృద్ధి సంస్థ ద్వారా ఆక్సీజన్ ప్లాంట్లను కొనాల్సి ఉంటుంది. కానీ అప్పటి ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలివిగా టెండర్లు పిలిపించి కట్టబెట్టారు.
Also Read :మండలిలో వైసీపీ నేతలపై నారా లోకేష్ ఆగ్రహం
ఒక్కో ఆక్సి జాన్ ప్లాంట్ ధర రూ.40 లక్షలోపు ఉండగా.. రూ.95 లక్షలుగా అంచనా వేసి దోచేశారు. రెండింటికి కలిపి రూ.1.90 కోట్ల అంచనా వ్యయంతో 2021-22లో టెండర్లు పిలిచారు. అతని సన్నిహితుడైన కృష్ణప్రసాద్ కు చెందిన ధన్వంతరి సంస్థకు టెండరు కట్టబెట్టారు. ఒప్పందం ప్రకారం ఆక్సిజన్ ప్లాంట్లను ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేశాక 50% సొమ్ము, అవి పనిచేయడం ఆరంభించిన మూడు నెలలకు 30%, మరో మూడు నెలలకు మిగిలిన డబ్బులు చెల్లించాల్సి ఉంది.