“వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)” బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇదివరకే ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం… 18,000 పేజీల కోవింద్ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్నదే జమిలి బిల్లు లక్ష్యం అని తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
Also Read: వేరే నాయకులు లేరా…? నాగబాబుకే ఎందుకు…?
విస్తృత సంప్రదింపులు జరిపిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ… జమిలి ఎన్నికలను 30కు పైగా పార్టీలు సమర్థించగా, కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయని నివేదికలో ప్రస్తావించారు. ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని వ్యతిరేకించింది కాంగ్రెస్. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా సిఫార్సులు చేసారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో మొత్తం 18 సవరణలు అవసరం కానున్నాయి.
Also Read: అమరావతి నిర్మాణం అప్పటి వరకు పూర్తి కాదా…?
వాటిలో ముఖ్యంగా ఆర్టికల్ 83 (పార్లమెంట్ వ్యవధి గురించి చెప్పే ఆర్టికల్), ఆర్టికల్ 172 (రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధి)ను సవరించాల్సి ఉంటుందని కేంద్రం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలంటే ఆర్టికల్ 324(ఏ), ఆర్టికల్ 325ను సవరించాల్సిన అవసరం ఉంది. 2029లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్దం చేసారు. జమిలి ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు ఒకే ఓటర్ల జాబితా సిద్దం చేసారు.