Tuesday, October 28, 2025 08:00 AM
Tuesday, October 28, 2025 08:00 AM
roots

వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై…?

వైసీపీ పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది. అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దాదాపు అన్ని జిల్లాల్లో కీలక నేతలంతా జగన్‌కు దూరమయ్యారు. పార్టీలో కొనసాగే పరిస్థితి లేదంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నిన్నటి వరకు జగనన్న అంటూ గొప్పగా చెప్పిన నేతలు కూడా… ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలతో ఆరోపణలు చేస్తున్నారు. కీలక నేతలంతా పార్టీకి దూరమైన ప్రస్తుత పరిస్థితుల్లో మరో నేత కూడా జగన్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

జగన్, షర్మిల ఆస్తుల గొడవ ఇప్పుడు క్రమంగా వైసీపీకి నేతలను దూరం చేస్తోంది. నిన్నటి వరకు టీడీపీ, జనసేన నేతలపై ఘాటు విమర్శలు చేసిన వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఇప్పుడు ఆ పార్టీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వైసీపీలో చేరిన వరుదు కళ్యాణి తొలి నుంచి టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ… ధర్మాన రాకతో ఛాన్స్ మిస్సయ్యింది. ఆ తర్వాత 2019లో అనకాపల్లి పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు.

సరిగ్గా ఎన్నికల ముందు విజయసాయిరెడ్డి చక్రం తిప్పడంతో మరోసారి చుక్కెదురైంది. దీంతో పార్టీ అగ్రనేతలపై వరుదు కళ్యాణి కాస్త గుర్రుగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం గెలిచిన మూడేళ్ల తర్వాత ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఇక చివర్లో నెల రోజుల పాటు మండలిలో చీఫ్ విప్ పదవి కూడా ఇచ్చారు. అధికారం పోయిన తర్వాత పోతుల సునీత రాజీనామా చేయడంతో… ఆమె స్థానంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించారు.

Also Read : జగన్‌ లో వచ్చిన మార్పుకి కారణం ఇదేనా..?

అయితే తాజాగా షర్మిల వ్యవహారంలో వరుద కళ్యాణిని జగన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదంలో షర్మిల ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైసీపీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని వంటి నేతలు షర్మిలపై ఆరోపణలు చేశారు. అయితే మహిళా విభాగం తరఫున కూడా ప్రెస్ మీట్ పెట్టి షర్మిలను తిట్టాలంటూ వరుదు కళ్యాణిని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే వరుదు కళ్యాణి మాత్రం… తనకు షర్మిలతో ఉన్న అనుబంధంతో పాటు… సాటి మహిళ అనే కోణంలో ప్రెస్ మీట్‌ పెట్టేందుకు నిరాకరించారు.

దీంతో ఆమె స్థానంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించారు వైసీపీ నేతలు. దీంతో వరుదు కళ్యాణి తీరుపై అధినేత జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం పర్యటన తర్వాత వరుదు కళ్యాణిని జగన్ దూరం పెట్టారు. చివరికి పార్టీ సమావేశాలకు కూడా పిలవటం లేదు. పైగా సొంత పార్టీ నేతలే ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. దీంతో వాసిరెడ్డి పద్మ బాటలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు వరుదు కళ్యాణి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్