Wednesday, August 5, 2026 07:44 AM
Wednesday, August 5, 2026 07:44 AM

పహల్గాం దాడికి నెల.. ఆ ఆరుగురు ఎక్కడ..?

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగి నెల రోజులు దాటింది. ఆరుగురు ఉగ్రవాదులు 27 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రపంచం.. తీవ్రంగా ఖండించింది. భారత్ కు ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల నుంచి మిత్ర దేశాల వరకు పూర్తి మద్దతు లభించింది.

Also Read : ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు

ఆ తర్వాత భారత్.. పాకిస్తాన్ లో సైనిక చర్య చేపట్టి అక్కడి ఉగ్రవాదులను హతమార్చింది. దాదాపు 100 మంది ఉగ్రవాదుల ను కాల్చి చంపామని భారత సైన్యం ప్రకటించింది. అయితే దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల ఆచూకీ మాత్రం ఇప్పటివరకు దర్యాప్తు బృందాలు కనుగొనలేకపోయాయి. ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు గాని.. దర్యాప్తు బృందాలు గానీ సేకరించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇటువంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు భారత ఆర్మీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతుంది.

Also Read : హరీష్ రావుకే కవిత మద్దతు..? లేఖ ఉద్దేశం ఇదేనా..?

దర్యాప్తు బృందాలు కూడా రంగంలోకి దిగి సోదాలు చేపడతాయి. కానీ ఇప్పటివరకు ఉగ్రవాదుల ఆచూకీ గుర్తించకపోవడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి. సైనిక చర్యలో భారత ఆర్మీ దూకుడుగా వ్యవహరించి ప్రశంసలు పొందినా.. దర్యాప్తు విషయంలో మాత్రం దూకుడు కనపడటం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కాశ్మీర్ అడవుల్లో పారిపోయిన ఉగ్రవాదుల జాడ ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. వాస్తవానికి దాడి జరిగిన ప్రాంతంలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. సరిహద్దులకు కూడా దూరంగా ఉండే ప్రాంతమే. స్థానికుల సహకారంతో వాళ్లు దేశం దాటిపోయారా.. లేదంటే ఆపరేషన్ సింధూర్.. లో మరణించిన వారిలో వీరు కూడా ఉన్నారా అనేది క్లారిటీ రావడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్