భారత క్రికెట్ జట్టులో రిటైర్మెంట్ల పర్వం కొనసాగే సంకేతాలు కనపడుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పే సంకేతాలు ఉన్నాయని మాజీలు అభిప్రాయపడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ తో ఈ రిటైర్మెంట్ పర్వం మొదలైందని… ఇక్కడి నుంచి ఒక్కొక్క సీనియర్ ఆటగాడు జట్టు నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది అంటూ మాజీలు తమ ఒపీనియన్ చెప్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ ఖచ్చితంగా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.
Also Read: అశ్విన్ విషయంలో రోహిత్ వర్సెస్ గంభీర్…?
అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే సంకేతాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. వీళ్లిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఐపీఎల్ లో కొనసాగనున్నారు. ఇద్దరూ ఫాంలో లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా కూడా ఆస్ట్రేలియా పర్యటన తర్వాత గుడ్ బై చెప్పే సంకేతాలు ఉండవచ్చు. గత కొంతకాలంగా బౌలింగ్ లో విఫలమవుతున్న జడేజా మునుపటి ఫామ్ లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు.
Also Read : రాహుల్ కు గాయం.. తప్పుకుంటే భారత్ కు చుక్కలే…!
దీనితో అతను కూడా తప్పుకోవాలి అనే ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ప్రస్తుతం జట్టులో లేని సీనియర్ ఆటగాళ్లు… పూజార, అజంక్య రహానే కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే సంకేతాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి లండన్ కు మకాం మార్చే పనిలో ఉన్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండులో జరగనున్న సీరిస్ కు అందుబాటులో ఉండి… ఆ తర్వాత గుడ్ బాయ్ చెప్పే సంకేతాలు ఉండవచ్చు అని జాతీయ మీడియా అంటోంది.
Also Read: అరెస్టు వెనుక ఇంత ప్లాన్ ఉందా…!
అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పెద్దగా రాణించని విరాట్ కోహ్లీ ఎంతవరకు ఇంగ్లాండ్ పర్యటన ముగిసే వరకు జట్టులో ఉంటాడు అనేది చెప్పలేని పరిస్థితి. టి20 క్రికెట్ కు అనూహ్యంగా గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా టెస్ట్ క్రికెట్ కు కూడా అలాగే చెప్పే సంకేతాలు ఉండవచ్చు అంటున్నారు అనలిస్ట్ లు.