మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న వార్ సీక్వెల్ పై నందమూరి అభిమానుల్లో చాలా ఆశలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విక్టరీ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా ఎన్టీఆర్ టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పోర్షన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది.
Also Read : వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ రాంరాం
దీనితో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో వస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సీక్వెల్ చేసే ఛాన్స్ ఉంది అనే వార్తలు వచ్చాయి. ఇదే టైంలో తమిళ స్టార్ డైరెక్టర్ తో ఓ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రి మారన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు మలయాళ డైరెక్టర్ తో సినిమాను లైన్లో పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ
డైరెక్టర్, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఎన్టీఆర్ తో చేయడానికి సుకుమారన్ ప్లాన్ చేశాడట. వచ్చేయడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు నిర్మాతగా కళ్యాణ్ రామ్, హీరో నాని వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ తమిళ, మలయాళ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. వేరే హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్ కు కన్నడ మార్కెట్ బాగుంది. అందుకే మలయాళ మార్కెట్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.