Tuesday, October 28, 2025 01:37 AM
Tuesday, October 28, 2025 01:37 AM
roots

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ రెడీ..!

సంక్రాంతి వస్తుందంటే చాలు సినిమాలకు సంబంధించి ఏ అప్డేట్ వస్తుందని ఆడియోస్ ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా గురించి చిన్న న్యూస్ వచ్చిన సరే సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది. స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరోల సినిమాలైనా సరే ఇప్పుడు అప్డేట్స్ కోసం ఎప్పుడు స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల డామినేషన్ మన తెలుగులో ఎక్కువగా కనబడుతోంది. కొంతమంది స్టార్ హీరోలు అయితే బాలీవుడ్ కి కూడా వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో బాలీవుడ్లో నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ కు పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ హీరోలను మించి క్రేజ్ ఉంది.

అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో బాగా ఫేమస్ అయ్యాడు. పుష్ప పార్ట్ 2 సినిమాతో అల్లు అర్జున్ కు నార్త్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు వీళ్ళ సినిమాలు గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ ఇండియా వైడ్ గా సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. దేవర సినిమాతో ఎన్టీఆర్ కు కన్నడ అలాగే తమిళంలో కూడా భారీ మార్కెట్ పెరిగింది. అందుకే సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రెడీ అవుతుంది. వార్ 2 సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ను వచ్చేనెల ఫినిష్ చేయనున్నాడు.

ఈ సినిమా కోసం రెండు నెలల నుంచి కష్టపడుతున్న ఎన్టీఆర్ మరో రెండు నెలలు కష్టపడి కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇక ఇప్పుడు వార్ 2 నుంచి సంక్రాంతికి ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఎన్టీఆర్కు సంబంధించి ఒక వీడియో అప్డేట్ను మొత్తం నాలుగు భాషల్లో రెడీ చేసి పెట్టారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ విలనిజం చూపించనున్నారు. మొత్తం ఈ నాలుగు భాషలకు స్వయంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం హైలెట్. సినిమా గురించి సౌత్ ఇండియాలో క్రేజ్ పెంచడానికి ఈ రేంజ్ లో ప్లాన్ చేశాడు నిర్మాత. ఇక ప్రభాస్ సినిమా గురించి కూడా సంక్రాంతికి మంచి క్రేజీ అప్డేట్స్ రెడీ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్