గత ఏడాది దేవర సినిమా తో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్లో వార్ 2 సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. వచ్చేయేడాది ఆగస్టు 15 సందర్భంగా సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక జనవరిలో ఎన్టీఆర్ కు సంబంధించిన పాత్ర షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోతున్నది. దీనితో ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్టుపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రెడీ అవుతోంది.
Also Read : యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ రెడీ..!
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. డ్రాగన్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ఓరేంజ్ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడు ఏళ్ల క్రితం ఈ సినిమాను ఫైనల్ చేసినా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉండడం.. అటు ప్రశాంత్ నీల్ కూడా వేరే ప్రాజెక్టులతో హడావుడిగా ఉండటంతో ఈ సినిమా ముందుకు వెళ్లలేదు. గత ఏడాది దేవర సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసి మేకింగ్ మొదలుపెట్టారు.
Also Read : త్రివిక్రమ్ తో స్టార్ట్ చేస్తాడా..? షాక్ ఇస్తాడా..?
ఇక ఈ నెల మూడో వారంలో కర్ణాటకలో తొలి షెడ్యూల్ మొదలుపెడతారు. ఎన్టీఆర్ వచ్చే నెలలో సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడట. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ రోల్ కచ్చితంగా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని.. దేవరా సినిమాలో ఎన్టీఆర్ రోల్ విషయంలో కాస్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని… కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగదని మేకర్స్ అంటున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోయిన్ గా.. కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తుంది ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.