టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. కథ సెలెక్షన్ బావున్నా సరే కొన్ని కొన్ని కారణాలతో సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. దీనితో విజయ్ దేవరకొండ కెరీర్ అయిపోయింది అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో అతను గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో విజయ్ రెండేళ్ల నుంచి గట్టిగానే కష్టపడుతున్నాడు.
Also Read: తండేల్: ఓవర్సీస్ లో వసూళ్ళ పండగ
ఇక ఈ సినిమా కోసం ఇప్పుడు స్టార్ హీరోల్ని కూడా వాడుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ ను దృష్టిలో పెట్టుకొని, క్రేజ్ తీసుకు రావాలని… తెలుగులో ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్, అలాగే హిందీలో రణబీర్ కపూర్ తో వాయిస్ ఓవర్, తమిళంలో సూర్యతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు రెడీ అవుతున్నారట. ఇక తెలుగులో ఎన్టీఆర్.. తెలంగాణ యాసలో ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్.. త్వరలోనే టైటిల్ కూడా గ్రాండ్ గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Also Read: బాలయ్యను అడ్డంపెట్టి రేవంత్ ను బుట్టలో వేస్తారా..?
ఇక రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ కానుంది. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమా… వేసవిలో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఇక సెకండ్ పార్ట్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక క్లైమాక్స్ ను కొంత భాగం షూట్ చేసి.. త్వరలో సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కే జి ఎఫ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఈ మధ్య ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా తో అయినా.. విజయ్ దేవరకొండ ఫామ్ లోకి వస్తాడా లేదా చూడాలి.