దేవర సినిమా రిలీజ్ టైం లో పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మనం చూసాం. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ దేవర సినిమా డిజాస్టర్ అని… రాజమౌళి సెంటిమెంట్ ను ఎవరూ బ్రేక్ చేయలేరు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేసారు. ఇక దేవర సీన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కూడా ట్రోల్ చేసారు. అయినా సరే దేవర తట్టుకుని నిలబడి భారీ హిట్ కొట్టింది. సినిమాకు సోషల్ మీడియా మైనస్ అయినా… మౌత్ టాక్ మాత్రం బాగా ప్లస్ అయింది. అందుకే వసూళ్లు భారీగా వచ్చాయి. ఇతర సినిమాల కంటే దేవర బెస్ట్ అనే టాక్ కూడా వచ్చింది.
దాదాపుగా 700 కోట్ల వసూళ్లు దేవర రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా దేవరకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఈ ట్రోలింగ్ లో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా జోక్యం చేసుకున్నారు. ఆచార్య ఫ్లాప్ విషయంలో కొరటాల… చిరంజీవిని టార్గెట్ చేసారని అందుకే మెగా ఫ్యాన్స్ దేవరను టార్గెట్ చేసారు అనే విషయం క్లారిటీ ఉన్నా… ఈ రేంజ్ లో ట్రోల్ చేస్తారని ఊహించలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పగ తీర్చుకోవడం స్టార్ట్ చేసారు. తాజాగా దీపావళి కానుకగా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ నుంచి ఓ లుక్ రిలీజ్ అయింది.
Also Read : వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై…?
ఆ లుక్ లో రామ్ చరణ్ రైలు పట్టాలపై లుంగీ కట్టుకుని కూర్చుని ఉంటాడు. ఆ లుక్ బాగున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఫిష్ మార్కెట్ లో రామ్ చరణ్ చేపలు అమ్ముతున్నట్టు ఓ ఫోటో మార్ఫ్ చేసారు. అలాగే వంట చేస్తున్నట్టు కూడా కొన్ని ఫోటోలు మార్ఫ్ చేసి వదులుతున్నారు. ఇక శంకర్ కు తమిళంలోనే దిక్కు లేదు అని… తెలుగులో ఆయన సినిమాలకు అంత సీన్ లేదు అంటూ పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అని… దేవర ప్రీ బుకింగ్ మార్కెట్ ను కూడా గేమ్ చేంజర్ బ్రేక్ చేయలేదు అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హీరోలు ఇద్దరూ స్నేహంగా ఉంటుండగా.. అభిమానులకి ఏమొచ్చింది అంటూ అభిమానుల పై సెటైర్లు వేస్తున్నారు మరికొందరు.