Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

కొడాలి నానీ అక్రమాలపై గురి పెట్టినట్టేనా…?

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యవహారంలో ఇప్పుడు పోలీసులు దూకుడు పెంచే అవకాశం కనబడుతోంది. ఆయన అనుచరులను ఒక్కొక్కరిని పోలీసులు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కృష్ణాజిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడిన కొడాలి నాని అండ్ కో ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల రంగం సిద్ధం చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. తాజాగా కొడాలి నాని వ్యవహారంలో ఓ పరిణామం చోటుచేసుకుంది. కొడాలి నాని అత్యంత సన్నిహితులకు 41 ఏ నోటీసులను జారీ చేశారు గుడివాడ పోలీసులు.

Also Read : వంశీకి బెయిల్ కష్టమేనా..? కోర్టులో ఆసక్తికర సన్నివేశాలు

వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గౌడాన్ వ్యవహారంలో బెదిరింపు కేసులలో అనుచరులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. కొడాలి నాని షాడోగా పేరున్న దుక్కిపాటి శశిభూషణ్.. సన్నిహిత మిత్రుడు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ రెండు కేసులలో మాజీ మంత్రి కొడాలి నాని.. అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి, జెసి మాధవి లతారెడ్డి పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read : సడెన్ గా ఒడిస్సాలో కనపడ్డ మహేష్.. రాజమౌళి ప్లానింగ్ ఏంటో…?

ఈ కేసుల్లో కోర్టుకు వెళ్లడంతో వారికి 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనితో వన్ టౌన్ పోలీసులు ఇచ్చారు. అయితే గుడివాడ పట్టణంలో దాదాపు 15 కోట్లు విలువ చేసే ఒక స్థలాన్ని కొడాలి నాని అనుచరులు కబ్జా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దానిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కొడాలి నాని అనుచరులలో ఇద్దరు అత్యంత కీలకంగా ఉంటారు. గుడివాడలో వీళ్ళిద్దరి ఆధీనంలోనే ఎక్కువగా దందాలు జరిగాయని, కొడాలి నాని ఆదేశాల మేరకు కబ్జాలకు పాల్పడ్డారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. దీనిపై మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ కేసులను బయటకు లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్