ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవులపై సర్కార్ ఫోకస్ చేసింది. దాదాపు నాలుగు నెలల నుంచి నామినేటెడ్ పదవుల విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. పార్టీ కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకత్వం ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్నా క్లారిటీ మాత్రం రావడం లేదు. మూడు పార్టీలు ఉండటంతో కూటమిలో పదవులపై పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ముఖ్యంగా దేవాదాయ, మార్కెట్ యార్డ్ కమిటీల విషయంలో చర్చ ఎక్కువగా జరుగుతోంది.
Also Read: జనసైనికులకు వార్నింగ్.. బీ కేర్ ఫుల్..!
అటు బిజెపి, జనసేన కూడా ఈ విషయంలో గట్టిగానే కసరత్తు చేసాయి. రెండు పార్టీలు కలిపి దాదాపు 40 శాతం పదవులను అడిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఎమ్మెల్యేల పరంగా సంఖ్య తక్కువగా ఉన్నా నామినేటెడ్ పదవుల విషయంలో పట్టుధలగానే ఉన్నాయి మూడు పార్టీలు. సమస్యలను పరిష్కరించి త్వరగా భర్తీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ కనపడుతోంది. ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవుల భర్తీ చేయనున్నారు.
Also Read: విజయసాయి ఫ్యూచర్ ప్లాన్ ఇదే..!
రాష్ట్రస్థాయిలో పలు కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేసారు. దేవాలయాల పాలకమండలిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు, జిల్లా నియోజకవర్గస్థాయిలో పదవుల ఎంపికపై పేర్లు పంపాలంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే కొందరి లిస్ట్ చేరింది. కూటమిలో టీడీపీకి 80 శాతం, జనసేన 15 శాతం, బీజేపీకి 5 శాతం మేర పదవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. లాబియింగ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలకు అధిష్టానం సూచించింది.