ఎన్నాళ్ళు గానో భారత క్రికెట్ జట్టు.. ఎదురు చూస్తున్న పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రూపంలో దొరికాడు అని భారత అభిమానులు సంబరపడేలోపే.. ఆ సంబరాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత మిడిల్ ఆర్డర్ లో కీలకంగా మారిన నితీష్ కుమార్ రెడ్డి.. ఆ పర్యటన తర్వాత మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఐపిఎల్ లో ఘోరంగా విఫలమైన నితీష్ రెడ్డి.. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ప్రభావం చూపకపోవడం కంగారు పెడుతున్న అంశం.
Also Read : ఆ విషయంలో అంత తొందర ఎందుకు..?
ఆస్ట్రేలియా పర్యటన ఆధారంగా అతనిని జట్టులో ఎంపిక చేసారు. తీరా చూస్తే బౌలింగ్, బ్యాటింగ్ లో అతను ఫెయిల్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో కూడా అతను కనీస ప్రదర్శన చేయలేదు అనే విషయం అర్ధమైంది. ఇక బౌలింగ్ లో కూడా వేగం లేకపోవడం, పస లేకపోవడంతో వికెట్లు పడలేదు. శార్దుల్ ఠాకూర్ మొదటి టెస్ట్ లో ఫెయిల్ కావడంతో నితీష్ ను రెండో టెస్ట్ కు ఎంపిక చేసారు. కాని అతను రెండో టెస్ట్ లో తీవ్రంగా నిరాశ పరచడం ఆందోళన కలిగించింది.
Also Read : కష్టాల క్రికెట్.. ఆకాష్ దీప్ జీవితంలో వరుస విషాదాలు
దీనితో నితీష్ కెరీర్ ఇక ముగిసినట్టే అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత్ కు ఎన్నో దశాబ్దాల కల. కపిల్ దేవ్ రిటైర్ అయిన తర్వాత ఆ స్థాయి ఆల్ రౌండర్ దొరకలేదు. హార్దిక్ పాండ్యా కాస్త ప్రభావం చూపించినా.. అతనికి ఫిట్నెస్ లేకపోవడం మైనస్ అయింది. చాలా మందిని ప్రయోగించిన సెలెక్టర్లు.. ఈ విషయంలో నిరాశ చెందుతూనే ఉన్నారు. విదేశీ పర్యటనలలో ఇది కీలక అంశం. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి విఫలం కావడంతో.. అతని కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




