Saturday, September 13, 2025 05:07 AM
Saturday, September 13, 2025 05:07 AM
roots

సరికొత్త రికార్డుల దిశగా ఎన్టీఆర్ దేవర

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ ని షేక్ చేయడం మొదలుపెట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో కంటే ఇతర భాషల్లో దేవర ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. ప్రీ బుకింగ్ ఓపెన్ కావడం ఆలస్యం, ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో దేవర సినిమా సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది. ముఖ్యంగా అమెరికా, కెనడాలో దేవర సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గతంలో ఏ భారతీయ హీరోకి సాధ్యం కాని రికార్డులు ఎన్టీఆర్ దేవర సొంతం చేసుకుంటుంది.

అమెరికాలో విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఇండియన్ సినిమాగా దేవర రికార్డ్ సృష్టించింది. అమెరికా, కెనడా దేశాల్లో మూడు మిలియన్ డాలర్ల వసూళ్ళ దిశగా వెళ్తోంది దేవర. మొత్తం అక్కడ 85 వేల టికెట్ లు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. విడుదలకు ఇంకా ఒక రోజు సమయం మిగిలి ఉండగానే దేవర రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇక మన దేశం విషయానికి వస్తే… బుక్ మై షో, పేటిఎంలో సినిమా బుకింగ్ కోసం 22 లక్షల మంది వెయిట్ చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నాయి.

Read Also : టిడిపి ప్రభుత్వంలో వైసీపీ పెత్తనం.. ఇదెక్కడి చోద్యం?

అలాగే… కన్నడ, తమిళ భాషల్లో సినిమాకు ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ వస్తోంది. బెంగళూరు నగరంలోనే ప్రీ బుకింగ్ మార్కెట్ దాదాపుగా 7 కోట్ల వరకు జరిగింది. ఇంకా ఒక రోజు మిగిలి ఉండటంతో ఏ రికార్డులు తన ఖాతాలో ఎన్టీఆర్ వేసుకుంటాడో అంటూ జనాలు ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీ బజ్ క్రియేట్ కావడం, ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా సినిమా చేయడంతో సినిమాపై భారీగా క్రేజ్ వచ్చింది. ఓ వైపు మెగా ఫ్యాన్స్ అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నా దేవర దూకుడు మాత్రం ఆగడం లేదనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్