ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. పెన్షన్లు రానివారికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా భర్తని కోల్పోయి ఒంటరిగా మిగిలిన మహిళలకు వితంతు పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా 60 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రెండు మూడు నెలలు నుంచి దీనిపై సందిగ్ధత నెలకొంది.
Also Read : నాకే పాపం తెలియదు.. పీఎస్ఆర్ ఆవేదన
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా అనర్హులకు పెన్షన్లు ఇచ్చారు అనే ఆరోపణలు వినిపించాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో దీనిపై పలు కార్యక్రమాలు నిర్వహించి అనర్హులను గుర్తించింది. త్వరలోనే అనర్హులకు పెన్షన్ కూడా తొలగించే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం జరుగుతుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు లక్ష పెన్షన్లను కొత్తగా అందించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో భర్తను కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
Also Read : మాజీ ఎంపీపై పోలీసులకు అంత దయ ఎందుకో..?
గ్రామస్థాయిలో పెన్షన్ల విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారాలను సైతం తిప్పికొట్టే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక అధికారులు పెన్షన్లపై పలు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండటంతో ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సైతం వినతి పత్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాదాపు కొత్త పెన్షన్లను మే ఒకటో తేదీ నుంచి అందుకోనున్నారు.