Tuesday, October 28, 2025 04:52 AM
Tuesday, October 28, 2025 04:52 AM
roots

భారతీయులకు దుబాయ్ గుడ్ న్యూస్..!

విదేశాల్లో స్థిరపడాలి అని భావించే వారికి మరో దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా తరహాలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన నూతన రెసిడెన్సీ పాలసీని అన్ని రంగాల నిపుణులకు మరింత అందుబాటులోకి తెచ్చింది. ఈ గల్ఫ్ దేశం.. నామినేషన్ ను బేస్ చేసుకుని.. కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. కొన్ని షరతులతో ఈ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో వ్యాపారంలో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టే వారికి మాత్రం కాకుండా ఇతరులకు కూడా ఇవ్వడానికి సిద్దపడింది ఆ దేశం.

Also Read : అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్

ఈ గోల్డెన్ వీసా నర్సులు, విద్యావేత్తలు, కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టారు. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మొదట.. మొదట రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టే వారి కోసం తీసుకొచ్చారు. 2022లో, 10 సంవత్సరాల వీసా కోసం కనీస ఆస్తి పరిమితిని AED 2 మిలియన్లకు తగ్గించారు. దీనితో పెద్ద ఎత్తున ఆ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇతర వ్యాపారాలకు కూడా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.

Also Read : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 7వ తరగతి బాలిక చిచ్చు

ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు కూడా మే నెలలో గోల్డెన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యనిర్వాహకులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, 15+ సంవత్సరాల అనుభవం ఉన్న నర్సులు, యూట్యూబర్‌లు, పాడ్‌కాస్టర్‌లు, డిజిటల్ క్రియేటర్లు, 25 ఏళ్లు పైబడిన గుర్తింపు పొందిన ఇ-స్పోర్ట్స్ నిపుణులు, లగ్జరీ యాచ్ యజమానులు సహా తదితరులకు గోల్డెన్ వీసాను అనుమతించారు. ఈ నిర్ణయం భారతీయులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్