Saturday, September 13, 2025 05:04 AM
Saturday, September 13, 2025 05:04 AM
roots

వైసీపీలో సజ్జల ముసలం….!

అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీని మరింత దిగజార్చేలా అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తం పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నీ తానే చూసుకున్నారు. ఈ విషయంలోనే జగన్ మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. నాయకులకు, జగన్‌కు మధ్య దూరం కూడా బాగా పెరిగింది. కేవలం సజ్జల వల్లే గత ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైందని కొందరు నాయకులు బహిరంగంగానే గగ్గోలు పెట్టారు.

Also Read : పాకిస్తాన్ ను ఇరికించిన బీసిసిఐ

అలాంటి సజ్జలకే జగన్ ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై పెద్ద దుమారమే రేగుతోంది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జలను జగన్ ప్రకటించడం ఇప్పుడు వైసీపీలో కొత్త వివాదానికి కారణం అవుతోంది. ఈ విషయంతో చాలా మంది సీనియర్లు సైలెంట్‌గా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి కూడా వచ్చారు. వాస్తవానికి రీజనల్ కో ఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కంటే సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. కానీ ఆయనే జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో స్పష్టంగా తెలుస్తోంది. 2014లో జగన్ జైలులో ఉన్నాడనే సానుభూతితో గెలుస్తామని వైసీపీ నేతలు భావించారు. కానీ ఓడిపోయారు.

దీంతో ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. మొదట జగన్ పాత్ర ఎక్కువగా ఉంటే… ఆ తర్వాత విజయసాయిరెడ్డి. 2019 ఎన్నికలకు ముందు వరకు విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక వనరులు సమకూర్చడం… బీఆర్ఎస్‌తో సమన్వయం, ఐ ప్యాక్ ద్వారా టీడీపీని ఇబ్బంది పెట్టడం వరకు విజయసాయిరెడ్డి మెయిన్ రోల్ పోషించారు. ఇక ఎన్నికల వరకు కూడా సజ్జల కేవలం మీడియా వ్యవహారాలు మాత్రమే చూశారు. పార్టీ గెలిచిన తర్వాత మాత్రం సజ్జల అందరినీ వెనక్కి నెట్టి ముందుకు వచ్చారు. ఒక దశలో తానే సీఎం అనే స్థాయిలో వ్యవహరించారు.

Also Read : సంక్రాతి నుంచి బాబు ‘మన్ కీ బాత్’

జగన్ దగ్గర పలుకుబడి అమాంతం పెంచుకున్నారు. ఎంతగా అంటే… ఆయన చెబితేనే ఏదైనా జరుగుతుందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చివరికి ఉద్యోగ సంఘాల నేతలను కూడా కంట్రోల్‌లో ఉండాలని లైవ్‌లో బెదిరించారు. దీంతో సజ్జలను కాస్తా సకల శాఖల మంత్రిగా పార్టీ నేతల విమర్శించారు. జగన్‌ను ఎమ్యెల్యేలు కూడా కలవటానికి వీలు లేకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇంఛార్జుగా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు పరిమితం చేసిన సజ్జల… ఆయన స్థానంలో తన కుమారుడిని నియమించుకున్నారు. మొత్తంగా ఆయనే కీలకం అయ్యారు. ఒకరకంగా ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జైలుకు వెళ్లడానికి కూడా సజ్జల భార్గవరెడ్డి కారణమే.

ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత సజ్జలదే బాధ్యత అని అందరూ విమర్శించారు కూడా. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని సజ్జల డీల్ చేసిన వైనంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేకుండా చేసినట్లుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి సజ్జల వల్లే వచ్చిందని ఆరోపిస్తున్న సీనియర్లు… మరోసారి సజ్జలను ఇంఛార్జ్‌గా నియమిస్తే.. ఎలా రాజకీయాలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. చివరికి మీడియా ముందు మాట్లాడాలన్నా కూడా సజ్జల ఆఫీసు నుంచి అనుమతి, స్క్రిప్ట్ రావాల్సిందే అని… లేకపోతే మాట్లాడవద్దని కూడా ఆర్డర్ వేస్తున్నారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నన్ని రోజులు అంటీముట్టనట్లుగానే ఉంటే మంచిదని చాలా మంది సీనియర్లు అభిప్రాయానికి వచ్చారు. ఏది ఏమైనా సరే… జగన్ నిర్ణయాలు పార్టీని మరింత భ్రష్టు పట్టిస్తున్నాయన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్