Monday, February 9, 2026 07:31 PM
Monday, February 9, 2026 07:31 PM

పసి కూనలు కాదు.. డైనమైట్స్..!

మనకు క్రికెట్ అనగానే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్.. అప్పుడప్పుడు వినపడే పేరు జింబాబ్వే, ఇప్పుడు ఎక్కువగా వినపడే పేరు ఆఫ్ఘనిస్తాన్. ఇవి మాత్రమే మనకు సుపరిచితం. ఏదైనా మెగా టోర్నీ జరిగినప్పుడే వినపడే పేర్లు ఐర్లాండ్, నెథర్లాండ్స్, యూఏఈ, ఒమన్.. ఇప్పుడు నేపాల్.. కానీ ప్రదర్శన విషయానికి వస్తే టెస్ట్ హోదా కలిగిన దేశాలే అగ్రగామిగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో మాత్రం చిన్న జట్లు దుమ్ము రేపుతున్నాయి.

వాళ్ళ వ్యూహం చూసిన క్రికెట్ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. టి20 అనగానే మనం భారీ స్కోర్ లు ఊహిస్తాం. కానీ చిన్న జట్లతో మ్యాచ్ లు ఆడుతున్న టాప్ టీమ్స్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ లో కూడా 200 పై చిలుకు స్కోరు సాధించలేదు అంటే వాళ్ళ బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికాను తక్కువ అంచనా వేసిన భారత్.. వాళ్ళ బౌలింగ్ దెబ్బకు కుదేలు అయింది. అదే రోజు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కు నెథర్లాండ్ చుక్కలు చూసింది. నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు నేపాల్ చుక్కలు చూపించింది.

తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుందని చిన్న జట్లు భావించి.. బౌలింగ్ కు పదును పెట్టాయి. ఈ టోర్నీలో అమెరికా, నేపాల్ జట్ల ఆట తీరు చాలా అద్భుతంగా అనిపించింది. నేపాల్ ఆటగాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ ప్రొఫెషనల్ గానే కనపడింది. అమెరికా బౌలింగ్ లైనప్, పిచ్ కండీషన్స్ ను వాళ్ళు వాడుకున్న విధానం కూడా అద్భుతంగానే ఉన్నాయి. ఇక మిగిలిన మ్యాచ్ లలో కూడా వాళ్ళేమి తక్కువ కాదు అనే సిగ్నల్స్ ఇచ్చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

అంబటి మరో పోసాని...

రాజకీయాల్లో నోటి దూల సహజమే.. అది...

చంద్రబాబుపై.. బీజేపీ ఎమ్మెల్యే...

ఒక వైపు ఏమో కమ్మ కులం...

రాజకీయాలకు కేసీఆర్ గుడ్...

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ...

కాంగ్రెస్‌తో జగన్ చేతులు...

దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు.. బెంగుళూరులో...

పోల్స్