Saturday, September 13, 2025 02:47 AM
Saturday, September 13, 2025 02:47 AM
roots

ఎన్టీఆర్ కు వింత అనుభవం.. ఆందోళనలో యూనిట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ కు పండుగకు మించిన వాతావరణం ఉంటుంది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో గా చేస్తున్న సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల ఎప్పుడా అంటూ దాదాపు ఏడాది నుంచి ఫ్యాన్స్ లో ఉత్కంఠత పెరుగుతోంది. అయితే ఇప్పుడు దేవర విషయంలో ఫ్యాన్స్ ని కొన్ని భయాలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. సినిమా ట్రైలర్ తర్వాతనే ఆ భయాలు ఎక్కువయ్యాయి అనే మాట అక్షరాలా నిజం.

సినిమాపై ఉన్న అంచనాలకు ట్రైలర్ కు సంబంధం లేదు అనే కామెంట్స్ వచ్చాయి. ఇక సినిమాను అన్ని వైపుల నుంచి టార్గెట్ చేయడం ఫ్యాన్స్ ని మరింత కంగారు పెడుతుంది. మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆ నెగటివ్ ప్రచారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కావడం లేదు. సోషల్ మీడియాలో సినిమాను సినిమాగా చూడకుండా టార్గెట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దేవరను దెబ్బకొట్టాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ట్రైలర్ కాపీ.. కాపీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Read Also : బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ నిలబెడతాడా..?

గతంలో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు ఈ స్థాయిలో నెగటివ్ ప్రచారం జరగలేదు. చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా టార్గెట్ చేసారు. దీనితో ఈ వారం రోజులు చిత్ర యూనిట్ జాగ్రత్త పడాలని భావిస్తోంది. సినిమా హైప్ పెంచే విధంగా ఒక ట్రైలర్ ను మళ్ళీ విడుదల చేయాలని భావిస్తోంది. మొదటి ట్రైలర్ ను టార్గెట్ చేయడం తో రెండో ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ పెట్టి విడుదల చేయాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. దీనితో అయినా సినిమాపై జరిగే నెగటివ్ టాక్ ఆగుతుందేమో అని చూస్తున్నారు. అయితే నెగటివ్ టాక్ ప్రభావం ఏమీ సినిమాపై పడేలా కూడా కనపడటం లేదు. విదేశాల్లో సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీగా జరుగుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్