ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలోగా చేసిన సినిమా దేవర. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు సాధించింది. 172 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా విషయంలో ఎంత నెగటివ్ ప్రచారం చేసినా సరే వసూళ్లు మాత్రం ఆగలేదు అనే చెప్పాలి. సినిమా విషయంలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు బాగుంది అంటే, మరికొందరు బాగాలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు.
కొరటాల శివ మార్క్ అసలు సినిమాలో ఎక్కడా కనపడలేదు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. కొరటాల శివ మీద ఉన్న కోపంతో మెగా ఫ్యాన్స్ గట్టిగానే టార్గెట్ చేసారు సినిమాను. ఇటు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేసారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుసరిస్తున్న వ్యవహారశైలి ఆశ్చర్యంగా ఉంటుంది. వాస్తవానికి ముందు బాలకృష్ణ ఫ్యాన్స్ సినిమాను ట్రోల్ చేయలేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ రాజకీయాలను లాగి బాలకృష్ణ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసారు.
Read Also : ప్యాలెస్ లో ఉన్న దొంగను బయటకి లాగండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ సినిమాను కావాలనే టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారనే భావనలో విపరీతమైన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయడంతో… ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి దేవరను టార్గెట్ చేసారు. మెగా ఫ్యాన్స్ కు కనీసం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాదిరిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవహరించడం దేవరకు ప్రధాన సమస్య అయింది. దీనితో దేవరను ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా నుంచి నెగటివ్ టాక్ ఇబ్బంది పెట్టింది. ఈ ప్రభావం ఇతర భాషలపై పడకపోయినా తెలుగులో మాత్రం గట్టిగానే పడింది. కొన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసారు. మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసినా టీడీపీ సోషల్ మీడియా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూరం చేసుకోవడం సమస్యగా మారింది దేవరకు.