దాదాపు నాలుగు నెలలుగా ఎంతో ఆసక్తిని రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి బీహార్ ఎన్నికలతో పాటుగా ఉపఎన్నికను నిర్వహించనున్నారు. దీనితో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.
Also Read : బెజవాడలో తగ్గని రద్దీ.. ఆశ్చర్యపోతున్న అధికారులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో చర్చలు జరిపారు. అభ్యర్థి విషయంలో ఇన్చార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక నేతలు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వారు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అప్పగించారు.
Also Read : ట్రంప్ కు షాక్ ఇచ్చిన ఇజ్రాయిల్..!
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ కు.. ఇన్చార్జిమంత్రులు ఓ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దాదాపుగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నవీన్ యాదవ్ కు స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు ఉంది. గతంలో మజిలీస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ముస్లిం సామాజిక వర్గంలో పట్టు సంపాదించుకున్నారు. దీనితో ఆయనకు సీటు ఇస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.