Monday, October 27, 2025 10:48 PM
Monday, October 27, 2025 10:48 PM
roots

అమెరికా టూర్ కు మోడీ.. ట్రంప్ తో భేటీ..?

భారత్ – అమెరికా దేశాల మధ్య సుంకాల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, రష్యాతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయనే కారణంతో జరిమానాల రూపంలో సుంకాలు విధించడం వంటి చర్యలకు దిగారు. రెండు సార్లుగా 50 శాతం సుంకాలను విధించారు ట్రంప్. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ ఎన్ని సుంకాలు విధించినా.. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

Also Read : సాక్షిలో అవినీతి.. ఉద్యోగుల మధ్య డిష్యూం డిష్యూం..!

ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ తో భేటీకి భారత ప్రధాని నరేంద్ర మోడీ సిద్దమైనట్టు జాతీయ మీడియా ప్రకటించింది. వచ్చే నెలలో ట్రంప్ తో మోడీ భేటీ అయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్న మోడీ.. అదే పర్యటనలో ట్రంప్ తో సమావేశం అవుతారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్, డిసిలోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం మోడీ అమెరికాకు వెళ్లారు.

Also Read : బ్లూ మీడియాగా న్యూట్రల్ మీడియా.. గతం మరిచిందా..?

సెప్టెంబర్ 9 నుంచి ఐఖ్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతాయి. సెప్టెంబర్ 23 న మోడీ అమెరికా పర్యటన షురు అవుతోందని జాతీయ మీడియా వెల్లడించింది. ఆ రోజున మోడీ వైట్ హౌస్ లో ప్రసంగిస్తారు. మోడీతో పాటుగా ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు ఈ పర్యటనకు వెళ్తారు. వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ట్రంప్.. భారత్ పై మొత్తం 50 శాతం సుంకాలను విధించారు. దీనిపై భారత్ తన వాణి వినిపించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్