అమెరికా.. అగ్రరాజ్యం అనే పొగరు.. రూపాయి కంటే డాలర్ ఎక్కువ అనే ధీమా.. ప్రతి ఒక్కరూ అమెరికాలో కాలు పెట్టాలని.. అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూస్తారనేది ఆ దేశం భావన. అమెరికా కూడా చాలా పొగరుగా ప్రవర్తిస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న దేశం కావడంతో.. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. అందుకే అమెరికా చెప్పినట్లుగా వినేది లేదని చైనా, రష్యా, ఉత్తరకొరియా వంటి దేశాలు బహిరంగంగానే ప్రకటించాయి. ఈ జాబితాలో తాజాగా భారత్ చేరినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. స్వదేశీ, మేకిన్ ఇండియా విధానం అమలులోకి వచ్చిన తర్వాత అమెరికా సహా ఇతర దేశాల మీద భారత్ ఆధారపడటం క్రమంగా తగ్గిపోతుందనే చెప్పాలి.
Also Read : కల్తీ మద్యం విషయంలో కూటమి నాయకులు బోల్తా..? మద్దతు ఎక్కడ..?
తాజాగా అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టిన డోనాల్డ్ ట్రంప్.. ప్రపంచంపై పెత్తనం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే భారత్ పై కూడా పన్నుల భారం వేశారు ట్రంప్. ఒకమాటలో చెప్పాలంటే భారత్‌పై అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకుంటున్నారు. రష్యా నుంచి చమురు తీసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. అందులో భాగంగానే భారత్ పై ఏకంగా 50 శాతం అదనపు సుంకాలు కూడా ట్రంప్ బాదేశారు. దీనిపై భారత్ ఏ మాత్రం వెనకడుగు వేయకపోవడంతో.. ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు. కానీ ఇదే ట్రంప్ లోపల ఒకలా.. పైకి మరోలా ఉంటున్నారు. ప్రధాని మోదీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ కనిపిస్తున్నారు. కానీ తెర వెనుక మాత్రం.. తాను చేయాలనుకున్నదే చేస్తున్నారు.
Also Read : 30 ఏళ్ళకే గుండెపోటు ఎందుకొస్తుంది?
పెద్దన్న అనే పేరున్న డోనాల్డ్ ట్రంప్ పెత్తనానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగానే జవాబు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తన వల్లే ఆగిపోయిందని.. భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధానికి తానే బ్రేక్ వేశాననేది ట్రంప్ పదే పదే చెప్తున్న మాట. భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే అని ట్రంప్ గొప్పగా ప్రకటించారు కూడా. అది కూడా ఏకంగా పది సార్లు ఇదే తరహా ప్రకటన చేశారు ట్రంప్. కానీ మోదీ మాత్రం.. అంత సీన్ లేదు అని తేల్చేశారు. ఇక మరో అడుగు ముందుకు వేసిన ట్రంప్.. తాను ఇప్పటికే 7 యుద్ధాలు ఆపినట్లు ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. అందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా ట్రంప్ కోరారు. తాజాగా ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య శాంతి ఒప్పందం కూడా తన వల్లే అని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం కోసం 20 దేశాల నేతలతో ట్రంప్ సమావేశమయ్యారు. దీనికి చివరి నిమిషంలో మోదీని ట్రంప్ ఆహ్వానించారు. కానీ మోదీ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
Also Read : అమరావతి రైతుల బాధ్యత ఆ ముగ్గురిదే: చంద్రబాబు
ఈజిప్ట్‌లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. అందుకే ఆ భేటీకి మోదీ దూరంగా ఉన్నారు. షరీఫ్‌తో కలిసి వేదిక పంచుకోవాలి. ఆ తర్వాత షరీష్‌తో మాట కలపాల్సి వస్తుంది. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌తో కలిసి పని చేసేందుకు భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరికి క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా క్రికెటర్లు విముఖత చూపారు. అందుకే శాంతి ఒప్పంద సదస్సుకు కూడా మోదీ హాజరు కాలేదని తెలుస్తోంది. మోదీ నిర్ణయానికి మద్దతు తెలియజేస్తున్న భారతీయులు.. మాపై మీ పెత్తనం ఏమిటని ట్రంప్‌ను నిలదీస్తున్నారు.