Saturday, September 13, 2025 09:50 AM
Saturday, September 13, 2025 09:50 AM
roots

దేవర దెబ్బ… సోషల్ మీడియాలో నందమూరి వార్

భారీ అంచనాల నడుమ వచ్చిన దేవర సినిమా ఆశించిన స్థాయిలో లేదు అనే టాక్ ప్రెకషకుల నుంచి వస్తోంది. సినిమాపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలకు, సినిమా విడుదల తర్వాత వస్తున్న టాక్ కు ఏ మాత్రం సంబంధం లేదు అంటున్నారు కొందరు అభిమానులు. ఖచ్చితంగా సినిమా ప్లాప్ అంటున్నారు మరికొందరు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా వేదికగా పెద్ద యుద్దమే జరుగుతోంది. నందమూరి అభిమానులు ఇప్పుడు సినిమా విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

బాలకృష్ణ అభిమానులు సినిమాపై నెగటివ్ టాక్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలో ఆశించినవి ఏం లేవని, రాజమౌళి సెంటిమెంట్ పక్కాగా వర్కౌట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రేంజ్ కి సినిమాకు సంబంధం లేదని కొరటాల మార్క్ ఎక్కడా లేదని పక్కాగా ఆచార్య 2 అంటూ మరికొందరు అంటున్నారు. ఇక కావాలనే ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని పక్కాగా దేవర మాస్ సినిమా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇప్పటికే సినిమాపై విదేశాల్లో ఫ్లాప్ టాక్ వచ్చింది. అంచనాలను అందుకోలేదు అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.

Read Also : ఎన్టీఆర్ కు వింత అనుభవం.. ఆందోళనలో యూనిట్

రెండేళ్లకు పైగా సమయం తీసుకున్నా సినిమా మాత్రం బాగాలేదని… కథలో పట్టు లేదని కొందరు ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ గానే ఉన్నారు ఇప్పటికి. ఆరేళ్ళ తర్వాత వస్తున్న దేవరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే సినిమా మాత్రం నిరాశపరిచింది అనే అభిప్రాయమే ఎక్కువగా వస్తోంది. సినిమా విషయంలో ఎన్టీఆర్ తొందరపడ్డాడు అని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయడం గమనార్హం. ఏది ఎలా ఈ సినిమా ప్రభావం కొరటాల కెరీర్ పై గట్టిగా పడే సూచనలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్