వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిన జగన్.. కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టారు. ప్రజలకు నేరుగా డబ్బులు పంపిణీ చేశారు. దీని కోసం దొరికిన ప్రతి చోట అప్పులు చేశారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మద్యం ఆదాయాన్ని ఏకంగా 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకువచ్చారు జగన్. దీంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఖజానా ఖాళీ చేశారు. ఉద్యోగులకు కూడా జీతాలు ఒకటో తేదీ ఇవ్వలేదు. వీటికి తోడు విధ్వంసం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పారిశ్రామిక వేత్తలు ముందుకు రాకపోగా.. పెట్టిన పెట్టుబడులను కూడా కొందరు వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉందని కూటమి పార్టీ నేతలు ఎన్నికల ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి తారుమారైంది.
Also Read : అంగరంగ వైభవంగా పసుపు పండుగ..!
ముందు పరిపాలనపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం… ఏడాది పాలన తర్వాత కాస్త కుదుట పడింది. దీంతో ఇక రాజకీయ అంశాలపై కూడా దృష్టి పెట్టింది. ప్రధానంగా గతంలో టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని, ఇబ్బందులు పెట్టిన వారిని ఇప్పుడు కూటమి సర్కార్ గుర్తిస్తోంది. ఎన్నికల తర్వాత చాలా మంది కేసుల భయంతో రాష్ట్ర వదిలి పారిపోయారు. అలాంటి వారిలో మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ తురగా కిషోర్ ఒకరు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లలో నాటి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై హత్యాయత్నం చేశాడు. ఇది చూసిన జగన్.. వీడు మనోడే అని కితాబిచ్చి.. ఏకంగా మునిసిపల్ ఛైర్మన్‌ను చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిషోర్ పారిపోయారు. నాటి నుంచి మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. 16 సార్లు కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్న తురగా కిషోర్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు మునిసిపల్ శాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కడప మేయర్ సురేష్‌పై కూడా వేటు పడింది.
Also Read : టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎందుకు ఎగరలేవు?
ఇలా పార్టీకి చెందిన మేయర్, ఛైర్మన్‌పై వేటు పడటం ఇప్పుడు వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. కడప కార్పొరేషన్ పనులను సొంత సంస్థకే కట్టబెట్టారని మేయర్ సురేష్‌పై వేటు వేశారు. కానీ కిషోర్‌పై వేటు విషయమే ఇప్పుడు వైసీపీ నేతలను భయపెడుతోంది. కౌన్సిల్ సమావేశానికి రానందుకే ఇలా వేటు పడటంతో.. ఇదే నియమం శాసనసభ్యులకు కూడా వర్తిస్తుంది కదా అనే చర్చ జోరుగా నడుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేరోజు ఒకసారి.. తర్వాత బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం రోజున సభకు వచ్చిన జగన్.. సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. నాటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ సభకు రాలేదు. ఇదే విషయంపై గతంలోనే స్పీకర్, డిప్యూసీ స్పీకర్ హెచ్చరించారు కూడా. సభకు గైర్హాజరవుతున్న జగన్‌పై కూడా వేటు ఖాయమనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.