Tuesday, October 28, 2025 02:29 AM
Tuesday, October 28, 2025 02:29 AM
roots

పోలవరం కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ ప్రత్యేకతలు ఇవే…!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఈ ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ పై సీరియస్ ఫోకస్ పెట్టారు. ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డయాఫ్రం వాల్ విషయంలో ప్రధానంగా విపక్షాలు ఆరోపణలు చేసాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికీ చూపించే ప్రయత్నం చేయలేదు.

Also Read : జనాభా పెరగాలి.. నేషనల్ మీడియాలో చంద్రబాబు కామెంట్స్ వైరల్..!

తాజాగా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు ఇవ్వాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 10.18 గంటలకు అధికారులు పనులను ప్రారంభించారు. నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతి ఇవ్వడంతో అధికారులు స్పీడ్ పెంచారు. టీ5 ప్లాస్టిక్ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు ఆరు మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో దీని నిర్మాణం చేపడతారు.

Also Read : తులసిబాబుపై ప్రేమ.. ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్…?

కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాల్సి ఉంటుంది. ఈ పనులను విదేశీ కంపెనీ బావర్ పూర్తి చేయనుంది. ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్లవంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించడం గమనార్హం. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా ప్లాస్టిక్ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రం వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలుపెట్టాలని ఆలోచనలో ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్