Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

ఆకట్టుకుంటున్న రానా దగ్గుబాటి షో.. అక్కినేని, దగ్గుబాటి కిడ్స్ సందడి

టాలీవుడ్ హీరోస్ లో దగ్గుబాటి హీరో రానాకు కాస్త స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. గోల్డెన్స్ ఫోన్ తో పుట్టిన రానా ఎప్పుడు ఏదో ఒక కొత్త పని చేస్తూనే ఉంటాడు. తాజాగా రానా దగ్గుపాటి షో అంటూ అమెజాన్ ప్రైమ్ లో ఒక షో మొదలుపెట్టాడు. ఈ షోకు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ షోలో మూడో ఎపిసోడ్ లో భాగంగా అక్కినేని అలాగే దగ్గుబాటి కుటుంబాలకు సంబంధించి తర్వాతి తరం వారసులను రానా ఆహ్వానించాడు. వెంకటేష్ కుమార్తె మాళవిక అలాగే యార్లగడ్డ సుమంత్, నాగచైతన్య అక్కినేని, రానా వైఫ్ మిహికా బజాజ్ హాజరై కాసేపు సందడి చేశారు.

Also Read : మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?

రానా, నాగచైతన్య ఇద్దరు కార్ల గురించి మాట్లాడుకోవడం ఆ తర్వాత జాయిన్ అయినా మాళవిక అలాగే ఆమె భర్త ప్రశాంత్, మిహిక సరదా సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి ఫోటోలను చూపించడమే కాకుండా ఒకరి అభిరుచులను మరొకరు పంచుకున్నారు. ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు బిజీగా ఉన్నా సరే ఈ షో ద్వారా మళ్ళీ కలిసి సరదాగా మాట్లాడుకోవడం చూసి సోషల్ మీడియా జనాలు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రానాకు నాగచైతన్యకు మధ్య ఉన్న అనుబంధం అలాగే నాగచైతన్యను వెంకటేష్ కుమార్తె మాళవిక బావ అంటూ సరదాగా మాట్లాడటం…

మిహికా తెలుగులో మాట్లాడే కొన్ని పదాలు అక్కడ ఆడిన గేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు రీల్స్ లో వైరల్ అవుతున్నాయి. ముందు రెండు ఎపిసోడ్లు కూడా బాగానే హిట్ అయ్యాయి. సిద్దు జొన్నలగడ్డ అలాగే శ్రీ లీలా వచ్చిన ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందు నానీతో చేసిన ఫస్ట్ ఎపిసోడ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఎపిసోడ్ లో యంగ్ హీరో తేజ సజ్జ కూడా పాల్గొన్నాడు.

Also Read : జగనన్న… మరో చెల్లి కూడా పోతున్నారన్నా…!

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న ఈ షోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేవలం అరగంట మాత్రమే ఉండే ఎపిసోడ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా అప్పటికప్పుడు తమకు ఏది నచ్చితే అది మాట్లాడుకునే విధంగా షో ప్లాన్ చేశారు. కేవలం తమ వ్యక్తిగత విషయాలను మాత్రమే అక్కడ పంచుకోవడం ఒకరితో ఒకరికి ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడం వంటివి ఆసక్తిగా మారాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్