ప్రభాస్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో కల్కి ఒకటి. దాదాపు 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఈ సినిమా. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఆ రేంజ్ వసూళ్లు సాధించింది ఈ సినిమానే. ఇక ఈ సినిమా రెండో పార్ట్ పై జనాల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కథ పెద్దగా ఉండటంతో రెండు భాగాలుగా చెప్పాలని డైరెక్టర్ ప్లాన్ చేశాడు. ఇక రెండో పార్ట్ లో కొంత షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు. మొదటి పార్ట్ షూటింగ్ టైంలోనే ఆ షూటింగ్ కూడా డైరెక్టర్ ప్లాన్ చేశాడు.
Also Read : ఏపీ అసెంబ్లీలో ధూళిపాళ్ళ మరో సంచలనం
ఇక మిగిలిన షూటింగ్ విషయంలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ సినిమా మొదలు పెడితే.. ప్రభాస్ కల్కి సినిమా ఎప్పుడు మొదలుపెడతాడు అనే దానిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా దీనిపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది చివర్లోనే సినిమా షూటింగ్ మొదలవుతుందని.. రెండో పార్ట్ లో ప్రభాస్ ఎక్కువగా కనబడతాడు అని స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.
Also Read : బిల్ గేట్స్ తో బాబు కీలక ఒప్పందాలు
రెండో పార్ట్ లో ఎక్కువగా భైరవ, కర్ణ పాత్రలు చుట్టూనే సినిమా తిరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి.. డైరెక్షన్ లో ఒక సినిమా అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా ఉంటుంది. స్పిరిట్ అనే టైటిల్ తో వస్తున్న ఆ సినిమాలో వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.