Friday, October 24, 2025 09:45 PM
Friday, October 24, 2025 09:45 PM
roots

భారీ బడ్జెట్ కు గుడ్ బై..

స్టార్ హీరోల సినిమాలు అనగానే భారీ బడ్జెట్ అనే మాట సినిమాకు అంచనాల పెంచేస్తోంది. సినిమా స్టోరీ ఎలా ఉన్నా సరే కొన్ని ఎలివేషన్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు.. మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు కంటే చిన్న సినిమాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చిన్న సినిమాలు పై నిర్మాతలు కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అగ్ర హీరోలతో సినిమాలు తీసి.. ఆ సినిమాలు ప్రమోషన్ చేసుకోవడానికి ఇబ్బందులు పడి.. సినిమాను మార్కెట్ లో నిలబెట్టడానికి నిర్మాతలు తీవ్రంగా కష్టపడుతున్నారు.

Also Read : లిక్కర్ కేసులో మిధున్ రెడ్డి ఫ్రెండ్స్ కీ రోల్..?

దీంతో బడా హీరోలతో సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు ఇప్పుడు చిన్న సినిమాలపై ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ అనగానే భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. పుష్ప సినిమాతో ఈ నిర్మాణ సంస్థ పేరు మరింత మార్గోగింది. ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో పెట్టుబడి పెడుతూ వచ్చింది ఈ నిర్మాణ సంస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలు సేఫ్ కాదు అనే నిర్ణయానికి వచ్చిన ఈ సంస్థ.. ప్రస్తుతం చేస్తున్న పెద్ద హీరోల సినిమాలు ప్రాజెక్టులు.. కొనసాగించి ఇకనుంచి చిన్న హీరోల సినిమాల పైన పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Also Read : పవన్ కు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

పుష్ప 2 సినిమా బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నిర్మాణ సంస్థకు కూడా పెద్దగా మిగలలేదు అనే కామెంట్స్ అయితే వచ్చాయి. సినిమా బడ్జెట్ భారీగా అయిపోవడమే కాకుండా ఏళ్ల తరబడి షూటింగ్ కొనసాగడం, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు అన్నీ కూడా నిర్మాతను బాగా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో కూడా విసిగిపోయిన ఆ నిర్మాణ సంస్థ ఇక భారీ బడ్జెట్ సినిమాలకు స్వస్తి పలకాలని నిర్ణయించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్