Monday, October 27, 2025 08:15 PM
Monday, October 27, 2025 08:15 PM
roots

రోహిత్ కు షాక్ ఇచ్చిన ముంబై

ఒకవైపు ఫామ్ లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. గతేడాది జరిగిన కొన్ని సంఘటనలను సీరియస్ గా తీసుకున్న ముంబై ఇండియన్స్ యాజమాన్యం తాజాగా రోహిత్ శర్మకు అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ వంటి వారికి షాక్ ఇచ్చింది. ఆ జట్టులో కీలక ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్లను దృష్టిలో పెట్టుకుని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆటగాళ్లకు సున్నితంగా హెచ్చరికలు పంపింది.

Also Read : గవాస్కర్ కి అవమానం.. క్రికెట్ ఆస్ట్రేలియా క్లారిటీ

ముంబై ఇండియన్స్ యాజమాన్యం ప్రొఫెషనల్ గా ఉంటుందని అలాగే జట్టు కూడా ప్రొఫెషనల్ గా ఉండాలని వచ్చే సీజన్లో అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని… ముంబై టీం ప్రతిష్ట, క్రేజ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరించింది. సీజన్ కు ఇంకా టైం ఉంది అని కాబట్టి.. ఆటగాళ్ల మధ్య సఖ్యత చాలా అవసరం అని గొడవలు అలకలకు చోటు లేదని స్పష్టంగా చెప్పింది. మాట వినకపోతే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని… ముంబై యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది.

Also Read : కేసీఆర్ ఇక రానట్టే.. క్లారిటీ ఇచ్చేసారు..!

సీనియర్ ఆటగాళ్లు క్రమశిక్షణగా లేకపోతే.. ఆ ప్రభావం జట్టుపై పడుతుందని యువ ఆటగాళ్లు భవిష్యత్తులో కీలకంగా మారే ఆటగాళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ముంబై యాజమాన్యం తేల్చి చెప్పేసింది. ఒకవైపు ఫామ్ లేక నానా ఇబ్బందులు పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకు ఒకరకంగా ఇది షాక్ అనే చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలను అప్పగించడాన్ని రోహిత్ శర్మ అలాగే సూర్య కుమార్ యాదవ్ వంటి వాళ్ళు తప్పుపడుతున్నారు. అటు టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బూమ్రా కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్