Friday, September 12, 2025 05:31 PM
Friday, September 12, 2025 05:31 PM
roots

మోనాలిసాకు సినిమా ఛాన్స్.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్

మహా కుంభమేళలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన మోనాలిసా అనే అమ్మాయికి సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్లోని కొన్ని డైలీ సీరియల్స్ ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారు. ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా రీసెంట్ గా ఆఫర్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసాడు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పూసలు అలాగే బ్యాగులు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ కావడంతో సినిమా వాళ్ళు ఇప్పుడు ఆమె వెంట పడుతున్నారు.

Also Read : టార్గెట్ బడా నిర్మాతలు.. హైదరాబాద్ లో భారీగా ఐటి సోదాలు..!

ముఖ్యంగా ఆమె కళ్ళకు బాలీవుడ్ జనాలు ఎట్రాక్ట్ అయిపోయారు. ఈ విషయంలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా అవకాశం ఇస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఒకవేళ ఆమెకు యాక్టింగ్ రాకపోతే నేర్పించైనా సరే కచ్చితంగా తన తర్వాతి సినిమాలో తీసుకుంటానని ప్రకటించాడు. డైరీ ఆఫ్ మణిపూర్ అనే టైటిల్ తో తాను సినిమా చేస్తున్నానని ఆ సినిమాలో ఆమెకు మంచి రోల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానంటూ ప్రకటించాడు. ఇక సోషల్ మీడియాలో కూడా జనాలు అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు.

Also Read : ఏపీ, తెలంగాణా మధ్య కృష్ణా జలాల రచ్చ…? పరిష్కారం దొరికేనా…?

దీనికి అందరూ పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో వెంటనే ఆమెను కలిసి సినిమాకు ఒప్పిస్తానని.. అవసరమైతే భారీ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అనౌన్స్ చేశాడు. తన తమ్ముడు చదువు కోసం కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న మోనాలిసా వ్యాపారం ఆమె క్రేజ్ కారణంగా పడిపోయింది. దీనితో ఆమె తండ్రి ఆమెను తిరిగి మధ్యప్రదేశ్ తీసుకెళ్లిపోయినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. స్వయంగా డైరెక్టర్ అనౌన్స్ చేయడంతో కచ్చితంగా త్వరలోనే ఆమె సిల్వర్ స్క్రీన్ పై మెరవడం ఖాయమని.. కచ్చితంగా సెలబ్రెటీ అవుతుందని ఆమెను ఫాలో అవుతున్న వారు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్