Friday, October 24, 2025 09:47 AM
Friday, October 24, 2025 09:47 AM
roots

ఫ్యాన్స్‌కి స్వయంగా వడ్డించిన సూర్య.. ఫొటోలు వైరల్

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తన ఫ్యాన్స్‌కి ఆదివారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్వయంగా ఆయనే వడ్డించారు కూడా. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి సూర్య తన సోదరుడు కార్తి ఇద్దరూ తమ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూనే ఉంటారు. తరచుగా వారిని కలుస్తూ ఏదైనా ఇబ్బందులు ఉన్నవారికి సాయం కూడా చేస్తుంటారు. అయితే గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య, కార్తి ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేశారు. దీంతో తమ అభిమానులకు సోదరులు ఇద్దరూ ప్రత్యేక విందు ఇచ్చారు.

సేవలను గుర్తిస్తూ
గతేడాది డిసెంబర్‌లో మిగ్‌జాం తుపాను దెబ్బకి చెన్నై నగరం అల్లకల్లోలం అయిపోయింది. సామాన్య ప్రజలతోపాటు ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తమ ఫ్యాన్స్ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని సూర్య, కార్తి కోరారు. అలానే సూర్య రూ.10లక్షలు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఫ్యాన్స్‌ భోజనాలు ఏర్పాటు చేసి చాలా సేవ చేశారు. వీరి సేవలను గుర్తించిన సూర్య అభిమానులను విందుకు ఆహ్వానించి స్వయంగా వడ్డించారు.

ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం సూర్య ‘కంగువా’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆరు డిఫరెంట్ లుక్స్‌లో సూర్య కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. అలానే యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటించారు.

ఇక లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో కూడా సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సూర్య 43 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పనులు జరుగుతున్నాయి. గతంలో సుధా కొంగరతో సూర్య చేసిన ‘సూరారై పొట్రు’ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా ‘ఆకాశం నీ హద్దురా’ అంటూ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ రిలీజై హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్య 43 కూడా అదే రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషిస్తున్నాడు. అలానే కేరళ బ్యూటీ నజ్రియా కూడా యాక్ట్ చేస్తుంది. ఇక మరో యాక్టర్ విజయ్ వర్మ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్