Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

మోక్షజ్ఞ ఎంట్రీ మళ్ళీ వాయిదా…?

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు దాదాపుగా ఐదారేళ్ళ నుంచి గట్టిగానే ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణకు కథలు నచ్చకపోవడం అలాగే మోక్షజ్ఞ కూడా సినిమాల కోసం రెడీగా లేకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ వాయిదా పడుతూ వస్తోంది. ఒక పక్కన స్టార్ హీరోల వారసులందరూ సినిమాల్లో రాణిస్తుంటే నందమూరి మోక్షజ్ఞ మాత్రం సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు అనే ప్రచారం కూడా నందమూరి అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నందమూరి మోక్షజ్ఞ ఒక సినిమాను మొదలుపెట్టాడు.

Also Read : అలా ఎలా అవకాశం ఇస్తారు సర్..!

బాలకృష్ణకు ఆ కథ నచ్చటం అలాగే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో మంచి హిట్ కొట్టడంతో నమ్మకంతో ఆ సినిమాను లాంచ్ చేశారు. దానికి సంబంధించిన లుక్స్ కూడా రీసెంట్ గా బయటకు వచ్చాయి. అయితే డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా మొదలవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా మాత్రం ఇంకా మొదలు కాకపోవడంతో నందమూరి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం ఆ సినిమా క్యాన్సిల్ అయింది అనే ప్రచారం జరుగుతుంది.

Also Read : క్లోజ్ ఫ్రెండ్స్ ను నిండా ముంచిన కొడాలి

దాని వెనుక కారణం ఏంటి అనేది తెలియకపోయినా కథలో కొన్ని మార్పులు బాలకృష్ణ చెప్పారని అది ప్రశాంత్ వర్మకు నచ్చలేదని కొంతమంది అంటున్నారు. అయితే ప్రశాంత్ వర్మ… ప్రభాస్ సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేశాడని ఇదే సమయంలో ఆదిత్య 999 సినిమాను బాలకృష్ణ మోక్షజ్ఞతో చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు బాలకృష్ణ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాను వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ తో ఒక సినిమా మొదలుపెట్టి అది వాయిదా వేసే ఇప్పుడు ఆ కథను ప్రభాస్ తో చేయడానికి రెడీ అయ్యాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేస్తున్నాడు. 2027 చివర్లో లేదా 2028లో ఆ సినిమా విడుదలయ్యే చాన్స్ ఉందనే టాక్ కూడా ఉంది. మరి మోక్షజ్ఞ సంగతి ఏంటి అనేదానిపై క్లారిటీ లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్