Wednesday, February 4, 2026 04:07 PM
Wednesday, February 4, 2026 04:07 PM

ప్రాణం పెట్టిన మియాన్ భాయ్.. నిప్పులు చెరిగే బంతులు..!

బూమ్రా లేకపోతే ఇండియన్ పేస్ బౌలింగ్ పరిస్థితి ఏంటీ..? ఇంగ్లాండ్ టూర్ కు ముందు చాలా మందిలో ఉన్న సందేహాలు ఇవే. సరైన బౌలర్ జట్టులో లేకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటనలో ఎలా సత్తా చాటుతాం అనే అనుమానాలు. వాటిని పటా పంచలు చేస్తూ.. నేనున్నాను అంటూ హైదరాబాది పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. బూమ్రా లేకపోయినా పర్వాలేదు అన్నట్టు.. నిప్పులు చెరిగాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతని ప్రదర్శన కంటే పట్టుదల బాగా ఆకట్టుకుంది.

Also Read : ఈ నాయుడు మామూలోడు కాదుగా..!

ఈ సీరీస్ లో మొత్తం 185 ఓవర్లు వేసాడు సిరాజ్. దాదాపుగా ప్రతీ బంతీ 135 కిలోమీటర్ల వేగంతో వేసాడు. ఈ విషయం ఇంగ్లాండ్ ఆటగాళ్లే ఒప్పుకున్నారు. బూమ్రా ఉన్న తొలి టెస్ట్ లో సిరాజ్ పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ రెండో టెస్ట్ నుంచి సిరాజ్ ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు. లాంగ్ స్పెల్స్ వేయడమే కాదు.. పాత బంతి వీక్నెస్ నుంచి బయటకు వచ్చేసాడు. స్వింగ్ కు అనుకూలంగా ఉండే ఇంగ్లీష్ పిచ్ లపై సిరాజ్ బౌలింగ్ తో చిన్నపాటి యుద్దమే చేసాడు. ఈ సీరీస్ లో మొత్తం 23 వికెట్లు తీసాడు సిరాజ్. ఈ సీరీస్ లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో సిరాజ్ ముందున్నాడు.

Also Read : ది బెస్ట్ టెస్ట్ మ్యాచ్.. హైదరాబాద్ నవాబ్ చాంపియన్ ఆట..!

లార్డ్స్ లో తన బ్యాటింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా సిరాజ్ పోరాటం ఆకట్టుకుంది. ఇక చివరి టెస్ట్ లో మొత్తం 9 వికెట్లు తీసాడు. చివరి రోజు 4 వికెట్లు భారత్ కు కావాల్సి ఉండగా సిరాజ్ మూడు వికెట్లు తీసాడు. జేమి స్మిత్ ను అవుట్ చేయడానికి సిరాజ్ వేసిన బంతులు.. అతని కెరీర్ లో ది బెస్ట్ అంటూ ఇంగ్లిష్ కామెంటేటర్లు కూడా కామెంట్ చేసారు. చివరి బంతి వరకు అతను అదే వేగం కొనసాగిస్తూ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఇక అతని ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఫీల్డింగ్ లో దాదాపు ఫీల్డ్ లోనే ఉన్నాడు. 25 రోజుల పాటు ఆడిన క్రికెట్ లో సిరాజ్ పట్టుదలకు ఫిదా అయిపోయారు క్రికెట్ విమర్శకులు సైతం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్