తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మెగా ఫ్యామిలీదే. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి గత ఐదు దశాబ్దాలుగా సినీప్రపంచానికి చేస్తున్న సేవలు చెప్పనవసరం లేదు. ఆయన చేసిన సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులకే కాకుండా, భారతీయ సినీ రంగానికే గొప్ప ప్రభావం చూపించాయి. 70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీకి తోడ్పడటం నిజంగా విశేషం. ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు తెలుగు తెరపై అడుగుపెట్టి మంచి విజయాలు అందుకున్నారు.
Also Read : వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?
ఇక బుల్లితెర విషయానికి వస్తే, అక్కడ ప్రేక్షకులను బాగా అలరించిన షోలలో బిగ్ బాస్ ప్రత్యేకం. ఈ రియాలిటీ షోలో పాల్గొని అనేక మంది కంటెస్టెంట్లు మంచి పాపులారిటీని సంపాదించారు. తాజాగా, మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ హీరో ఎవరో తెలుసా? ‘మొగలి రేకులు’ సీరియల్ ద్వారా అపారమైన అభిమానులను సంపాదించిన సాగర్. ఆయన నిజంగా మెగా ఫ్యామిలీ హీరో ఎలా అవుతాడనే సందేహం కొందరికి రావచ్చు. అయితే, చిరంజీవి తల్లి అంజనా దేవి, సాగర్ నటనపై ఫిదా అయి, ఒకసారి ఆయనను ఇంటికి పిలిపించి మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె “నువ్వు కూడా మా మెగా ఫ్యామిలీ హీరోనే” అంటూ ఆయనను ప్రోత్సహించిందని చెబుతారు. అప్పటి నుంచి సాగర్‌ను అంజనా దేవి తన కుటుంబ సభ్యుడిలా చూసుకుంటోందట.
Also Read : ట్రంప్ కు బ్రిక్స్ దెబ్బ.. గట్టి దెబ్బ కొట్టనున్న భారత్ – రష్యా – చైనా..!
ఇక సాగర్‌కు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. అందువల్లనే ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా సాగర్‌ను ‘మెగా ఫ్యామిలీ హీరో’గా భావించి ఆహ్వానిస్తున్నారట. ఏదేమైనా, సాగర్ నిజంగానే సీజన్ 9 హౌస్‌లోకి అడుగుపెడతాడా లేదా అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.