Tuesday, October 28, 2025 04:20 AM
Tuesday, October 28, 2025 04:20 AM
roots

గుడిలో ఈవో పెత్తనం.. ఎమ్మెల్యే ఆగ్రహం..!

అందరూ కలిసి పనిచేయాలి… అందరినీ కలుపుకుంటూ వెళ్లాలి అనేది ఏపీలో కూటమి ప్రభుత్వ లక్ష్యం. కానీ కొందరు అధికారుల తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇందుకు ఉదాహరణ విజయవాడ దుర్గ గుడి ఈవో రామారావు. మరో నెలలో రిటైర్ అవుతున్నా… కాబట్టి నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే దేవస్థానాల్లో రెండో స్థానంలో ఉన్న ఆలయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయం. భక్తుల రద్దీ కూడా రోజు రోజుకు పెరుగుతోంది.

Also Read: వైసీపీ కామెడి.. అల్లు అర్జున్ మాత్రమే మనిషా..? 5 ఏళ్ళ పాపాలు మరిచారా..?

అదే సమయంలో ఆలయంలో వివాదాలు కూడా ప్రతి రోజు అదే స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న విషయాలపై ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ నాట్య అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా గిరి ప్రదక్షిణకు ఈవో అనుమతి ఇచ్చారు. సుమారు 400 మంది కళాకారులు నృత్యం చేస్తూ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. అలాగే వంద మంది వరకు మహిళల బృందం కూడా కోలాటం చేస్తూనే ప్రదక్షిణ చేసింది.

Kanada Durga Temple Giri Pradakshina

 

దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్లు ప్రత్యేకంగా నమోదు చేశారు. 12 కిలోమీటర్ల పైగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో ఈ స్థాయిలో ఎక్కడా ఎవరు చేయలేదని గిన్నిస్ బుక్‌లో రికార్డ్ చేశారు. అయితే ఇంతటి మెగా ఈవెంట్ జరుగుతున్నప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులతో పాటు చివరికి ఆలయ పాలకమండలి సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అదేమంటే.. మరో నెలలో రిటైర్ అవుతున్నా కదా.. కాబట్టి ఇలాంటి మెగా ఈవెంట్‌ పూర్తిగా నా చేతుల మీదుగానే జరిగాలి… ఇందులో ప్రజా ప్రతినిధులకు అవసరం లేదు అని ఈవో రామారావు చెప్పారట.

Also Read: మోడీ 1… బాబు 2… జగన్ 3… ముగ్గురూ ముంచేశారు

అయితే ఈవెంట్ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి… ఈవోకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ గురించి కూడా సమాచారం ఇవ్వరా అని ప్రశ్నించారట. దనికి సమాధానం చెప్పకుండా… ఈవో మాత్రం… అదేం అంత పెద్ద కార్యక్రమం కాదని… ఏదో చిన్న కార్యక్రమం అని చెప్పేసి ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. చివరికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదు అయినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి… ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్