Saturday, September 13, 2025 01:22 AM
Saturday, September 13, 2025 01:22 AM
roots

దటీజ్ గొట్టిపాటి..!

వేరే పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చి నిలబడి, కలబడటం అంటే గొప్ప విషయంగానే చెప్పాలి. పార్టీలోకి రావడం ఈజీ అయినా ఆ తర్వాత చంద్రబాబు మెప్పు పొందడం మాత్రం చాలా కష్టమే. అలా కష్టపడి మెప్పు పొందిన వారిలో గొట్టిపాటి రవి ఒకరు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు చుక్కలు చూపించారు. ఇప్పుడు టీడీపీ టికెట్ మీద రెండు సార్లు విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో గొట్టిపాటికి విధించిన జరిమానాలు చాలా పెద్దవి. మైనింగ్ వ్యాపారాలు చేసుకునే రవికి ఏకంగా వందల కోట్లు జరిమానా విధించారు.

కానీ ఆయన వెంట పార్టీ గట్టిగా నిలబడింది. న్యాయస్థానాల్లో పోరాడి ఆ జరిమానాల నుంచి రవి తప్పించుకున్నారు. ఇప్పుడు మంత్రి అయ్యారు… మంత్రిగా రవి పని తీరుపై చంద్రబాబు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే పార్టీ బలోపేతం కోసం రవి చేస్తున్న పనులు కూడా చంద్రబాబుకి నచ్చుతున్నాయని అంటున్నారు జిల్లా నేతలు. జిల్లా నుంచి ఎవరైనా పార్టీ మారాలి అనుకుంటే… వాళ్ళ గురించి రవి మొత్తం విచారణ చేస్తున్నారు. రవి దగ్గరకు వచ్చినా లేదా చంద్రబాబు దగ్గరకు వెళ్ళినా వాళ్ళ చరిత్ర మొత్తం చంద్రబాబు వద్ద పెడుతున్నారు. జిల్లా టీడీపీలో కొందరు కోవర్ట్ నాయకులు ఉన్నారు.

వాళ్ళ విషయంలో రవి చాలా సీరియస్ గా ఉన్నారు. ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడటం రవి గమనించి వారిపై కూడా నివేదిక ఇచ్చారట చంద్రబాబుకి. ఇక తన శాఖపై రవి పట్టు పెంచుకోవడం పట్ల చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు అని సమాచారం. ఇటీవల వరదల సమయంలో విద్యుత్ శాఖను సమర్ధంగా నడిపించారు రవి. కీలక అధికారులు ఏం చేయాలో, ముందు ఏ పనులు చేయాలో రవి స్వయంగా చెప్పడం, పర్యవేక్షించడం చేసారు. అదే విధంగా బాపట్ల దగ్గర కృష్ణా నదికి గండి పడిన సమయంలో రవి చూపించిన చొరవ ప్రభుత్వ పెద్దల మెప్పు పొందింది.

ఇలా నాయకుడిగా, మంత్రిగా రవి పని తీరు మాత్రం అమోఘం అంటున్నారు పార్టీ నేతలు. అటు అధికారులతో కూడా దూకుడుగా లేకుండా చాలా సున్నితంగా మాట్లాడుతూ తన శాఖపై పట్టు పెంచుకుంటున్నారు అని అధికారులే చెబుతున్నారు. దీంతో ఆయనతో పనిచేయడానికి అధికారులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే విద్యుత్ శాఖలో బదిలీలు చేయాల్సిందే అని రవి పట్టుదలగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో సమర్ధవంతంగా పని చేయని అధికారుల మీద ఆయన గురి పెట్టారు. దీంతో తొందరలోనే కొందరు అధికారులకి స్దాన చలనం తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా గొట్టిపాటి రవి తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధినాయకుడి ప్రశంసలు పొందుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్