సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు.. అతని సినిమా చూసేందుకు బారులు తీరుతూ ఉంటారు. ఇప్పుడు కూలీ అనే సినిమాను రజనీ కాంత్ పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ కూలీ’ సినిమా క్రేజ్ రికార్డు స్థాయికి చేరుకుంది. టిక్కెట్లు రూ.4,500 వరకు అమ్ముడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ అయినా, థియేటర్లో కొన్నా సరే.. ఫస్ట్ షో చూడాలంటే కొన్ని చోట్ల అంత మొత్తం వెచ్చించాల్సిందే.
Also Read : ఉప ఎన్నికల్లో గెలుపెవరిది..?
‘కూలీ’ సినిమాకు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో అదిరిపోయే మార్కెట్ జరుగుతోంది. ఈ క్రేజ్ చూసి బాలీవుడ్ కూడా షాక్ అవుతోంది. చెన్నైలోని ఒక ప్రముఖ థియేటర్ టిక్కెట్ల ధరను రూ.4,500కు నిర్ణయించినట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. పొల్లాచ్చిలో, ఒక థియేటర్ సిబ్బంది మొదటి రోజు మొదటి షో టిక్కెట్లను రూ.400కి అమ్ముతుండటం రికార్డ్ అయింది. ఇది తమిళనాడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ.. చాలా చోట్ల ఇలాగే పరిస్థితి ఉంది.
Also Read : తెలుగు బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఓ సెన్సేషన్.. ఎన్ని కోట్లంటే..?
ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ ఓనర్లె ఇలా విక్రయిస్తున్నారట. రూ. 600, రూ. 1,000, అత్యధికంగా రూ. 4,500 వరకు ఉన్నాయి. యాప్ బుకింగ్ కూడా సాధ్యం కావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్లు రూ.2,000 వరకు అమ్ముడవుతున్నాయి. బెంగళూరులో మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధర రూ.500 కాగా, ముంబై థియేటర్లలో ‘కూలీ’ టిక్కెట్ల ధరలు రూ.250 నుండి రూ.500 వరకు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు.