హైదరాబాద్ మెట్రో.. భాగ్యనగరానికి ప్రస్తుతం గుండె కాయ లాంటిది. మెట్రో అందుబాటులోకి వచ్చిన అనంతరం ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. దీనితో మెట్రో సేవలను కూడా పెద్ద ఎత్తున విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో సేవలు లేకపోవడంతో అటు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ మూలకు మెట్రో మార్గం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే మెట్రో నిర్మాణ సంస్థ మాత్రం నష్టాలతో ముందుకు వెళ్తోంది.
Also Read : విజయసాయి తర్వాత మిథున్ రెడ్డి.. వెంటాడుతున్న సిట్
ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నా సరే మెట్రో మాత్రం నష్టాల్లోనే నడుస్తోంది. కరోనా సమయంలో తగిలిన ఎదురు దెబ్బలతో మెట్రో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటుంది. దీనితో ఇప్పుడు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంచాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ.. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని L&T సంస్థ కోరిన సంగతి తెలిసిందే.
Also Read : ఏపీ ఫైబర్ నెట్ లో కీలక పరిణామం
కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని L&T సంస్థ అంటోంది. లేకపోతే కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే దానిపై L&T మెట్రో సంస్థ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు చేసారు. మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసిన సంస్థ.. ప్రకటనలపై కూడా ధరలు పెంచాలని భావిస్తోంది.