Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

మెగా ఫ్యాన్స్ కు మళ్ళీ వెయిటింగ్ తప్పదా…?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో వస్తున్న విశ్వంభరా సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవడంతో.. ఈ సినిమా అయినా హిట్టు కొడుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా రాంచరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా పెద్దగా ఆడకపోవడం.. వేరే హీరోల సినిమాలు సూపర్ హిట్లు కావడంతో మెగా ఫ్యాన్స్ విశ్వంభరా సినిమా ఎలాగైనా తమ ఆకలి తీరుస్తుందని వైట్ చేస్తున్నారు.

Also Read : మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై.. మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. 2023లో ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు.. 2025 సంక్రాంతికి పక్కాగా వస్తామని ప్రకటించారు. 2024 డిసెంబర్లోనే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినా.. గ్రాఫిక్ వర్క్స్ కారణంగా సినిమా లేట్ అయింది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రిలీజ్ అవుతుందని అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెల అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జూన్ లేదా జూలై నెలలకు ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.

Also Read : ఆయన ఆదేశించాడు.. మేము పాటించామంతే..!

సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని, రెండు పాటలు షూట్ చేయాలని.. అలాగే ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా షూట్ చేయాల్సి ఉందని మేకర్స్ అంటున్నారు. అందుకే సినిమా జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఓవైపు నందమూరి హీరోలు వరుస హిట్లు కొడుతున్నారు. చివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా 100 కోట్ల సినిమా వచ్చింది. అల్లు అర్జున్ కూడా అదిరిపోయే హిట్టు కొట్టాడు. ప్రభాస్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. అయినా సరే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం సరైన హిట్ లేకపోవడంతో అభిమానులు డీలా పడిపోతున్నారు. మరి విశ్వంభరా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. మెగా ఫాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్